విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న గృహ నిర్మాణ పథకం పనులు త్వరితగతిన పూర్తీ చేసి పేద ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మండల అధికారులు, ఇంజినీర్లను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి గృహ నిర్మాణ శాఖ మండల అధికారులు, ఇంజినీర్లుతో గృహ నిర్మాణ పనితీరుపై కలెక్టర్ ఢిల్లీరావు టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో గృహ నిర్మాణ పనులు లక్ష్య సాధన ఆశించిన స్థాయిలో లేదని ఇంకను పూర్తికాని గృహాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లాకు సంబంధిచి 16 వేల 347 గృహాలు లక్ష్యం కాగా 6,854 పూర్తీ చేయడం జరిగిందని, 9493 వచ్చే మార్చి నాటికీ పూర్తీ చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో లబ్దిధారులకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్ఇఓలను, హౌసింగ్ ఎఇలను ఆదేశించారు.టెలీకాన్ఫెరెన్స్ లో గృహ నిర్మాణ శాఖ పిడి శ్రీదేవి, డిఇలు, ఎంపిడివోలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు
Prajavartha Online Telugu News