విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన మహిళా పాడి రైతులకు రోజువారీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునే వర్కింగ్ క్యాపిటల్ రుణాలను మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ కేడీసీసీ బ్యాంక్ అధికారులను కోరారు.
జగనన్న పాలవెల్లువ పై శుక్రవారం జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ రెవిన్యూ, పశుసంవర్ధక, జిల్లా గ్రామీణాభివృద్ధి, సహకార కేడీసీసీ బ్యాంక్ అధికారులతో వర్చువల్ గా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహిళా పాడి రైతులను ప్రోత్సహించేందుకు అర్హులైన లబ్ధిదారులకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు అందించాలని కేడీసీసీ బ్యాంక్ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జగనన్న పాలవెల్లువ పథకం అమలు జరుగుతున్న మండలాలలోని గ్రామాలలో పదిమంది డా. వైయస్సార్ చేయూత పథకం ద్వారా మహిళా లబ్ధిదారులకు పాడి పశువులు కొనుగోలు చేసుకునేందుకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. రోజువారి పాల సేకరణ మెరుగుపరిచేందుకు మండల స్థాయి అధికారులు సంబంధిత గ్రామాలలో సమావేశాలు నిర్వహించి మహిళా పాడి రైతులకు అవగాహన కల్పించాలన్నారు.వర్చువల్ కాన్ఫరెన్స్ లో ఆర్డీవో తిరువూరు వై.వి. ప్రసన్నలక్ష్మి, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా. విద్యాసాగర్, డిఆర్డిఏ పిడి కే. శ్రీనివాస్, డిసిఒ సిహెచ్ శైలజ, కేడీసీసీ బ్యాంక్ జిఎం బి.ఎల్. చంద్రశేఖర్, ఎంపీడీవోలు, తహసిల్దార్లు, జగనన్న పాలవెల్లువ అధికారులు సిబ్బంది ఉన్నారు.
Prajavartha Online Telugu News