Breaking News

పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం యన్ టి ఆర్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో సంకల్ప దీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 3న గన్నవరం సమీపం ధర్మస్థలి లో పాత పెన్షన్ సాధన కోసం యుటిఎఫ్ ఆధ్వర్యంలో సంకల్ప దీక్ష భగ్నం చేయడాన్ని నిరసిస్తూ యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో యూ టి ఎఫ్ రాష్ట్ర కార్యాలయం సంకల్ప దీక్ష జరిపినట్టు ఎన్‌.టి.ఆర్‌  జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే శ్రీనివాసరావు ఏ సుందరయ్య ఒక ప్రకటనలో తెలియపరిచారు..ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే నిర్బంధాలా… యుటిఎఫ్ సూటి ప్రశ్న పాదయాత్ర సందర్భంలో నేను అధికారంలోకి వస్తే వారం రోజులు లోపు సిపిఎస్ రద్దు చేస్తున్నారని చెప్పిన హామీని అమలు చేయమని అడిగితే నిర్బంధం ప్రయోగించడం ఎలాంటి ప్రజాస్వామ్య0 అని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు N.వెంకటేశ్వర్లు సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతూ ఫిబ్రవరి 3న గన్నవరంలో పెట్టిన దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఒకరోజు సంకల్ప దీక్ష జరిగింది ఈ దీక్షకు యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు K. శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ దీక్ష శిబిరాన్ని రాష్ట్ర కార్యదర్శి ఏ కృష్ణ సుందర్రావు ప్రారంభించారు ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు N. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాతపెన్షన్ తప్ప మరేదీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు లాభం లేదని స్పష్టంచేశారు.33% ఎలా పాత పెన్షన్ కి సమానమో చెప్పాలని డిమాండ్ చేశారు. GPS లో మినహాయింపు చేసే 20%సొమ్ము కార్పొరేట్ లు నిర్వహించే ప్రవేట్ సంస్థలలో పెట్టుబడి పెట్టడం ఎలా ప్రభుత్వం కి, ఉద్యోగులకు లాభాలు వస్తాయో ప్రభుత్వం చెప్పాలని కోరారు. హామీ ఇవ్వని రాష్ట్రాలు పాత పెన్షన్ ని పునరుద్ధరణ చేస్తోంటే, హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదో ప్రభుత్వం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి SP మనోహర కుమార్ మాట్లాడుతూ సి.పి.ఎస్ స్కీం వల్ల ఉద్యోగుల జీవితాలు పదవి విరమణ అనంతరం అగమ్య గోచరంగా మారుతాయి అని నేడు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల లో పాలకపక్షాలు సిపిఎస్ రద్దు చేస్తాయని ప్రకటన లు చేస్తూ ఓ.పి.యస్ పునరుద్ధరణ కు అడుగులు వేస్తున్నారు. కానీ మన ముఖ్య మంత్రి గారు కూడా ఒక వారం రోజులలో రద్దు చేస్థాను అని ఆనాడు పాదయాత్రలో హామీ ఇచ్చారు. కానీ నేటికీ సి.పి.యస్ హామీ నెర వేర లేదు. అంతేకాకుండా సి.పి.యస్ బదులుగా జి.పి.యస్ స్కీం ప్రవేశ పెడతాం అని చెప్పాడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు. యు టి ఎఫ్ యన్ టి ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి  ఏ.సుందరయ్య మాట్లాడుతూ 33% గ్యా రంటీ తో ఇచ్చే పెన్షన్ ఉపయోగం లేదని, మరియు జీ.పి.యస్ స్కీం లో ఇచ్చే హెల్త్ కార్డ్, హెల్త్ ఇన్సూరెన్స్, కనీస పెన్షన్, వంటి సౌకర్యాలు వలన ఉద్యోగి కి పెద్ద ప్రయోజనాలు లేవని తెలుపుతూ పాత పెన్షన్ స్కీమ్ కి మాత్రమే మాకు ఆమోదం అని తెలిపారు. కావున పాత పెన్షన్ పునరుద్దరణ కోసం ఈ సంకల్ప దీక్ష కార్యక్రమం తో పాటు భవిష్యత్ కార్యక్రమాలు కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాము అని సుందరయ్య చెప్పారు. యు టి ఎఫ్ NTR జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసరావు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ చతిస్ ఘడ్, తమిళనాడు, హర్యానా మాదిరిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సిపిఎస్ రద్దు చేయాలని అధ్యక్షుడు ఏ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో UTF రాష్ట్ర కార్యదర్శి యస్ పి మనోహర్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఏ. కృష్ణ సుందర రావు, ,మరియు జిల్లా అధక్ష , ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస రావు, ఏ.సుందరయ్య, జిల్లా కార్యదర్శులు యం.శ్రీనివాసరావు, ఎం. రత్న కమల బాబు, డి.హరి ప్రసాద్, రెడ్ స్టార్, కే.గంగ రాజు, పి.భవాని రాష్ట్ర కౌన్సిలర్ పాలకొల్లు శ్రీనివాస్ రావు, ఏ.గోపాలకృష్ణ, సిటీ ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, లలిత శ్రీ, భరత్,దేవ్, నాగేశ్వర రావు తదితరులు వున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

HNSS పనులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా…2027లోగా పూర్తి చేయాలని ఆదేశం

-2027 నాటికి HNSS శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులుపై కేబినెట్‌లో మంత్రి మండిపల్లిని అడిగిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *