Breaking News

ప్రజా సంక్షేమమే జగనన్న లక్ష్యం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 21వ డివిజన్,108 సచివాలయం పరిధిలో రణధీర్ నగర్ కట్ట ప్రాంతంలో నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత మూడేళ్ళుగా ఈ ప్రాంతంలో మునుపెన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు రెండవ విడత నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. ఇక్కడి చాలాకాలంగా పెండింగులో ఉన్న కమ్యూనిటీ హల్ నిర్మాణానికి మరో వారంలో శంకుస్థాపన చేసి పనులు మొదలుపెడతామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ కరకట్ట ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారని, అసలు అభివృద్ధి చేయడలేదని విమర్శించారు. కానీ నేడు వైసీపీ నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు అని, ఇంటింటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి,కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ అడపా శేషు,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,వైస్సార్సీపీ నాయకులు టి.పి రోడ్,పుప్పాల రాజా మరియు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *