Breaking News

దేశ, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలి :  జమీల్‌ అహ్మద్‌ బేగ్‌

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక శ్రీ హజరత్‌ కాలేమస్తాన్‌ షావలి దర్గాలో బుధవారం నుంచి 131వ ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఐదు రోజులపాటు జరుగనున్నాయి. కుల, మత బేధము లేకుండా హిందూ, ముస్లింలు సోదరభావంతో కలసిమెలసి ఒకటై జరుపుకుంటున్న మహోత్సవాలకు వివిధ ప్రాంతాలనుంచి ముస్లింలు విచ్చేసి బాబా వారికి శేష వస్త్రములను (ఛాదర్‌) చందనమును సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఎన్‌సిపి మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల మైనార్టీ విభాగాల అబ్జర్వర్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ దర్గాను సందర్శించి, చాదర్‌ను సమర్పించారు. దేశ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో జీవించేలా ఆశీస్సులివ్వాలని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం తరఫున కోరు కున్నట్లు జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *