విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా లక్కరాజు రామారావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం స్థానిక ఆంధ్ర రత్న భవన్లో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఏపీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన మాట్లాడుతూ దేశానికి నాయకులను అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. వైసీపీలో మంత్రులు గాని కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగాని గతంలో యువజన కాంగ్రెస్ లోపనిచేసి నాయకులయ్యారన్నారు. చంద్రబాబు కూడా యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేసిన వారే అన్నారు .ఎంతో మంది నాయకుల్ని తయారుచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ప్రస్తుతం వైసీపీ, టిడిపి, జనసేన, పార్టీలు మోడీ భజన చేస్తున్నాయని ప్రజలకు ప్రత్యామ్నాయ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. సందర్భంగా లక్కరాజు రామారావు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా నాపై నమ్మకంతో అధిష్టానం అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తా నని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి,కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు శాయి శక్తుల కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బి.వి. శ్రీనివాస్ ,శ్రీ కృష్ణ కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఏపీ సీసీ సభ్యులు మమత నాగిరెడ్డి, పార్టీ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజీ, వి.గురునాథం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News