Breaking News

జగనన్న కాలనీల్లో ఉగాది నాటికి గృహ ప్రవేశాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల్లో ఉగాది నాటికి గృహ ప్రవేశాలు జరిగేలా ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, హౌసింగ్, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులను నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో ఇంజినీరింగ్, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో, కాంట్రాక్టర్లతో జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణ పనులు, నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ ఉగాది నాటికి ప్రతి లే అవుట్ లో గృహ ప్రవేశాలు జరిగేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలన్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్ లకు అందించే ఇనుము పంపిణీలో లోపాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని, విచారణ చేసి సంబందిత హౌసింగ్ అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని హౌసింగ్ యం.డి.కి లేఖ రాస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి, ఇళ్ళ నిర్మాణంకు కూడా తోడ్పాటుని అందిస్తుంటే అధికారులు మరింత కృషి చేసి ఇళ్ళ నిర్మాణాలు వేగంగా పూర్తి అయ్యేలా చూడాలని, ఇందులో ఎటువంటి అవినీతికి పాల్పడినా పోలీసు కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. లే అవుట్ ల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని, లబ్దిదారులు ఇళ్ళ నిర్మాణం చేసుకునేలా సచివాలయ కార్యదర్శులు, నోడల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్లు పనుల వేగవంతం చేయాలని, అవసరమైన కార్మికులను సిద్దం చేసుకోవాలన్నారు. ప్రతి లే అవుట్ నుండి కాంట్రాక్టర్ ప్రతి రోజు నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు చేయాలని, నోడల్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. లే అవుట్ ల వారిగా ఎప్పటికప్పుడు పనుల పురోగతి పై నివేదిక ఇవ్వాలని, ఏ సమస్య ఎదురైనా అధికారులు సమన్వయంతో పరిష్కరించి పనుల వేగవంతంకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై సమీక్షిస్తూ, 15 ఫైనాన్స్ కమిషన్ నిధులతో చేపట్టిన పనులకు వెంటనే సిఎఫ్ఎంఎస్ లో బిల్లులు అప్ లోడ్ చేయాలని, స్వచ్చ సర్వేక్షణ్ 2023లో భాగంగా టాయ్ లెట్ 2.1 మేరకు నగరంలోని నగరపాలక సంస్థ పబ్లిక్ టాయ్ లెట్స్ మరమత్తులు వెంటనే పూర్తి చేయాలని ఏ.ఈ.లను ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ ఐలాండ్స్ అభివృద్ధి పనులు, నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ అభివృద్ధి పనులు ఈ నెల చివరికి పూర్తీ చేయాలన్నారు. రోడ్ విస్తరణ పనులు పూర్తయిన ప్రాంతాల్లో డ్రైన్ల నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలన్నారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, హౌసింగ్ పి.డి. సాయినాద్ కుమార్, ఈ.ఈ. శంకరరావు, నగరపాలక సంస్థ ఎస్.ఈ. భాస్కర్, ఈ.ఈ.లు సుందర్రామిరెడ్డి, శాంతిరాజు, కొండారెడ్డి, కోటేశ్వరరావు, హౌసింగ్, నగరపాలక సంస్థ డి.ఈ.ఈ.లు, ఏ.ఈ.లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *