Breaking News

గడప గడపలో వెల్లివిరుస్తోన్న నవరత్నాలు

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-58 వ డివిజన్ 241 వ వార్డు సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో ప్రతి ఇంటా సంక్షేమం వెల్లివిరుస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గురువారం 58 వ డివిజన్ 241 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందిరానాయక్ నగర్ లో విస్తృతంగా పర్యటించి.. 155 గడపలను సందర్శించారు. మూడున్నరేళ్ల పాలనలో అందించిన సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లినా, ఏ పేద కుటుంబం తలుపుతట్టినా.. సంక్షేమ పథకాలు అందుతున్నాయనే చెబుతున్నారని మల్లాది విష్ణు తెలిపారు. పథకాల అమలులో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన.. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. గత పాలకులు మాటలతో కాలయాపన చేశారని.. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తున్నట్లు తెలియజేశారు.

విజయవాడ నగర చరిత్రలో ఓ మైలురాయి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా.. వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చే దిశగా ఆలోచన చేస్తారని మల్లాది విష్ణు తెలిపారు. 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములను డీనోటిఫై చేయాలని.. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీలో చేతులు మారిన ఇళ్ల రీ-రిజిస్ట్రేషన్ కు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. రాధానగర్, ప్రకాష్ నగర్, ప్రజాశక్తి నగర్, పాయకాపురం, కండ్రిక, ఎన్.ఎస్.సి.బోస్ నగర్, శాంతినగర్, సుందరయ్య కాలనీ పరిసర ప్రాంతాలలో ఇళ్ల రిజిస్ట్రేషన్ల సౌకర్యం లేక దశాబ్దాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వీటన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, జీఓ నెం.4 విడుదల చేసినట్లు తెలిపారు. దీని ద్వారా 24,330 మంది కుటుంబాలకు మేలు కలుగుతుందని వెల్లడించారు. అలాగే జీవో 225, జీవో 36 ద్వారా 150 గజాల లోపు అందరికీ ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. ఈ మేరకు నియోజకవర్గ ప్రజల తరపున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నిర్ణయం ద్వారా సెంట్రల్ లో 5వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని.. వీలైనంత త్వరలో జీవో కూడా విడుదల కానుందని పేర్కొన్నారు.

లోకేష్ పొర్లు దండాలు పెట్టినా ఒక్క సీటు రాదు
టీడీపీపైనా, చంద్రబాబు గత పాలనపై ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పూర్తి విరక్తి చెందారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, చిత్తూరు జిల్లా అధ్యక్షుల మాటలలో ఈ విషయం మరోసారి స్పష్టమైందన్నారు. ప్రజలలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైందని.. లోకేష్ పాదయాత్రకు డబ్బులు ఇచ్చి ప్రజలను తరలిస్తున్నట్లు స్వయంగా ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారన్నారు. ప్రజాదరణ లేని యాత్రను జాకీలు పెట్టి హైప్ క్రియేట్ చేసేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారని విమర్శించారు. నారాలోకేష్ యాత్ర చూశాక.. పాదయాత్రలకు కాలం చెల్లిందని తెలంగాణ నేత అన్న మాటలు నిజమే అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల స్పందన ఏమాత్రం లేని లోకేష్ పాదయాత్ర వల్ల కాళ్లు అరిగిపోవడం తప్ప ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.

అనంతరం నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడారు. ప్రతపక్షనేత చంద్రబాబు తన కుమారుడు నారాలోకేష్ కి తెలుగు నేర్పించి ఉంటే బాగుండేదని విమర్శించారు. పాదయాత్రలో లోకేష్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, Y.నిర్మల, ఇసరపు రాజారమేష్, జాన్ బాబు, తోపుల వరలక్ష్మి, శర్మ, నేరెళ్ల శివ, కాళ్ల ఆదినారాయణ, శ్యామ్, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *