Breaking News

డి ఎల్ ఆర్ తర్వాత, ఆర్ ఓ ఆర్ అయిన తర్వాత గ్రామసభ నిర్వహించాలి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఫైనల్ ఆర్ ఓ ఆర్ అయిన తర్వాత గ్రామ సభను నిర్వహించి సంబంధిత వివరాలు గ్రామస్థులకు తెలపాలని దీనిని వీడియో గ్రఫీ చేయించాలని సీసీఎల్ఏ స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో వర్చువల్ విధానంలో అమరావతి నుండి జగనన్న భూహక్కు -భూరక్ష రీ సర్వే అంశాలపై సమీక్షించగా తిరుపతి కలెక్టరేట్ నుండి జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ ఏడి సర్వే జయరాజ్ సంబంధిత అధికారులతో కలసి వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రౌండ్ వెక్టరైజేషన్, గ్రౌండ్ వ్యాలిడేషన్, గ్రౌండ్ ట్రూతింగ్ తర్వాత 9(2) 10(2) నోటీసులు సంబంధికులకు అందజేసి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించాలని అన్నారు. డీ ఎల్ ఆర్ అయిన తర్వాత గ్రామసభ నిర్వహించి దానిని వీడియో తీయించి సంబంధిత ఆర్డిఓ కార్యాలయాలలో భద్రపరచాలని తెలిపారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ రీ సర్వే రెండవ ఫేజ్ 202 లక్ష్యం కాగా 25 పూర్తి అయ్యాయని 11 గ్రామాలు ఈ వారంలో పూర్తి అవుతాయని, 76 గ్రామాలకు గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి అయిందని, 90 గ్రామాలలో పనులు పురోగతిలో ఉన్నాయని రీ సర్వే ప్రక్రియ వేగవంతం కొరకు చర్యలు చేపట్టి ఫిబ్రవరి 20 నాటికి గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేసి లక్ష్యాలను అందిపుచ్చుకుని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో జి సెక్షన్ సూపరింటెండెంట్ భార్గవి, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *