-కార్యకర్తలకు భవిష్యత్తు, భరోసా, భద్రత ఇచ్చేలా పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఇస్తున్నారు
-పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తో పార్టీ కోసం క్రమశిక్షణ తో పని చేస్తున్నాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సితార సెంటర్ వద్ద 45&44 డివిజన్ అధ్యక్షులు బొమ్ము రాంబాబు మరియు మల్లెపు విజయలక్ష్మి ల ఆధ్వర్యంలో జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమ పోస్టర్ విడుదల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ పాల్గొని జనసేన మూడో విడత సభ్యత్వ నమోదు పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదటి విడత పిఎసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సితార సెంటర్ వద్ద నుండి అధికారికంగా ప్రారంభించినారు అందువలన మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు యొక్క పోస్టర్ విడుదలను ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని, పశ్చిమ నియోజకవర్గం లో 5-7 వేల సభ్యత్వాలు నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాంమని, జనసేన కి జన సైనికులే బలం.. నాయకులు వస్తుంటారు.. పోతుంటారని, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు తో పార్టీ కోసం క్రమశిక్షణ తో పని చేస్తున్నాంమని, క్రియాశీల సభ్యులు కు ఐదు లక్షలు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించారని కార్యకర్తలకు భవిష్యత్తు, భరోసా, భద్రత ఇచ్చేలా పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఇస్తున్నారని, దేశంలో ఏ పార్టీ కూడా ప్రమాద భీమా ఐదు లక్షలు అమలు చేయలేదని, వివిధ సందర్భాలలో మరణించిన, గాయపడిన కార్యకర్తలు కు ఆరు కోట్ల రూపాయల వరకు అంద చేశారని, కొంతమంది నాయకులు ఏ పని చేయకుండా బిల్డప్ లు ఇస్తున్నారని, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు కు ప్రాధాన్యత ఉంటుందని, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ల సూచనలతో పార్టీ ని బలోపేతం చేస్తాంమని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నెమళ్ళ సంజీవరావు, రావి సౌజన్య, స్టాలిన్ శంకర్ ,కొరగంజి రమణ, నల్లబెల్లి కనకారావు, పొట్నూరి శ్రీనివాసరావు, తిరుపతి అనూష, సాయి శరత్, తమ్మిన లీలా కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News