-షుమారు రూ.57 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు స్టాండింగ్ కమిటి ఆమోదం
-ఎంఎల్ఏలు, కార్పొరేటర్ల ప్రతిపాదనలు ఆమోదం
-పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు అతీతంగా నగర సమగ్రాభివృద్దే ధ్యేయం
-మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ఎన్నడూ లేని విధంగా సమగ్రంగా అభివృద్ధి పనులు చేపట్టుటకు స్తాయి సంఘం సమావేశం లో చర్చించి ఆమోదించామని స్థాయిసంఘ అధ్యక్షులు మరియు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో నగర కమిషనర్ కీర్తి చేకూరి, స్టాండింగ్ కమిటి సభ్యులు, విభాగాధీపతులతో స్థాయి సంఘ సమావేశం నిర్వహించి 165 అంశాలకు, పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా స్థాయి సంఘ అధ్యక్షులు మరియు మేయర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో ప్రజా ప్రతినిధులు మరియు ఉన్నతాధికారుల పరిశీలనలో గుర్తించిన ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా డివిజన్ల వారీగా ప్రాధాన్యత క్రమంలో సి.సి రోడ్లు, డ్రైన్లు మరియు కల్వర్టుల నిర్మాణాలకు, పార్క్ ల అభివృద్ధి ఆమోదం తెలిపామన్నారు. అలాగే రోడ్ల విస్తరణ జరుగుతున్న ప్రాంతాలలో అభివృద్ధి పనులు నిర్వహించుటకు ఆమోదం తెలిపామన్నారు. నగరంలోని ప్రధాన రహదారులలోని ఐలాండ్ లు అభివృద్దికి ఆమోదం తెలిపామన్నారు. విలీన గ్రామాల్లో నూతనంగా సి సి డ్రైన్లు, రోడ్ల ఏర్పాటుకు ప్రత్యేక ఆమోదం తెలిపామన్నారు.
ప్రదానంగా రూ.22 కోట్లతో 60 ప్రాంతాల్లో సిసి రోడ్లు, రూ.11 కోట్లతో 38 ప్రాంతాల్లో డ్రైన్లు, రూ.3.15 కోట్లతో పార్క్ ల అభివృద్ధి పనులు, రూ.90 లక్షలతో 2 ప్రాంతాల్లో బిటి రోడ్లు, మరో 25 ప్రాంతాల్లో రూ9.50 కోట్లతో సిసి రోడ్లు, డ్రైన్లు నిర్మాణంకు ఆమోదం తెలిపామన్నారు. రూ.6.21 కోట్లతో కమ్యూనిటి హాల్స్ నిర్మాణాలు, రూ.2.03 కోట్లతో 2023 సమ్మర్ యాక్షన్ ప్లాన్, రూ.1.49 కోట్లతో శ్మశానవాటికల అభివృద్ధి, రూ.39.59 లక్షలతో విద్యుత్ పనులకు స్టాండింగ్ కమిటి ఆమోదం తెలిపిందన్నారు.
అభివృద్ధి పనుల్లో ప్రదానంగా గోరంట్ల మేరి ప్రియ నగర్, తూర్పు బజార్ ల్లో రూ.98.90 లక్షలతో సిసి రోడ్లు, నరసరాపేట రోడ్ సాయి నగర్ మెయిన్ రోడ్ లో సిసి రోడ్ కి రూ.50 లక్షలు, మెడికల్ క్లబ్ రోడ్ సిసి రోడ్ కు రూ.50 లక్షలు, ఆదర్శ నగర్ లో రూ.34 లక్షలతో సిసి రోడ్, శాంతి నగర్ లో రూ. 50 లక్షలతో సిసి రోడ్, చుట్టగుంట నుండి చిలకలూరిపేట రోడ్ బైపాస్ వరకు విద్యుత్ పనులకు రూ.28 లక్షలు, గడ్డిమడుల కాలని 1 నుండి 4 వరకు రూ.46 లక్షలతో సిసి డ్రైన్స్, చిలకలూరిపేట రోడ్ తిరుపతమ్మ గుడి నుండి ఎన్ఆర్టి రోడ్ వరకు రూ.30 లక్షలతో డ్రైన్స్ , సుగాలి కాలనిలో రూ.49.40 లక్షలతో సిసి రోడ్, ఎన్.టి.ఆర్. కాలనీ 2 నుండి 5 లైన్ల వరకు రూ.49.90 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణంకు ఆమోదం తెలిపామన్నారు.
సమావేశంలోస్థాయి సంఘ సభ్యులు నిమ్మల వెంకట రమణ, బొడ్డుపల్లి స్మిత పద్మజ, షేక్ జుమ్మాబి, మల్లవరపు రమ్య, నగర పాలక సంస్థ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ నాగేంద్ర కుమార్, ఎస్.ఈ. భాస్కర్, ఎంహెచ్ఓ డాక్టర్ భాను ప్రకాష్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News