Breaking News

“ VMC Sports Meet – 2023”

-క్రీడలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉద్యోగులు పాల్గొని విజయవంతము చేయాలి
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ లోని ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు ఉద్యోగుల నడుమ 2023, ఫిబ్రవరి 17,18 మరియు 19 తేదిలలో “ VMC Sports Meet – 2023” నిర్వహరణ పోటిల వివరాలకు సంబందించిన అంశాలను నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి అధికారులతో కలసి లాటరీ విధానము ద్వారా పోటి చేయు టీమ్ లను ఎంపిక చేసినారు. 1) మేయర్ జట్టు 2) కమిషనర్ జట్టు 3) మున్సిపల్ రెవెన్యూ 4) ఇంజనీరింగ్ 5) పబ్లిక్ హెల్త్ 6) టౌన్ ప్లానింగ్ 7) యు.సి.డి 8) ఎడ్యుకేషన్ ( విద్య) 9) రెవిన్యూ (వి.ఆర్.ఓ) 10) మహిళా పోలీస్ జట్లు మొదలగు 10 రకాల జట్లు సదరు స్పోర్ట్స్ మీట్ నందు పాల్గొన బోవుచున్నారు. ఈ జట్ల లలో జరుగునున్న పోటిల వివరాలు… 100 మరియు 400 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, 400 మీటర్ల నడక, షార్ట్ పుట్, షటిల్ బ్యాట్ మెంట్, క్రికెట్, వాలీ బాల్, కబాడీ, టెన్నిస్, చెస్, త్రో బాల్, టెన్నీ కాయిట్.

ఈ పోటిలలో జూనియర్, స్త్రీ, పురుషులు మరియు సీనియర్ స్త్రీ, పురుషుల విభాగముల వారు పాల్గొనుచున్నారు. పై క్రీడాత్మకులకు సంబంధించిన పోటిలకు గాను నేడు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా అధికారుల సమక్షంలో మ్యాచ్ డ్రా లను లాటరీ పద్దతిలో తీయడం జరిగింది.

కార్యక్రమంలో VMC Sports Meet – 2023 అధికారులు డి.ఎఫ్.ఓ శ్రీనివాస్, అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్)  కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం. ప్రభాకర రావు, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్) జుబిన్ శిరన్ రాయ్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ప్రాజెక్ట్ ఆఫీసర్ శకుంతల మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *