Breaking News

“చింతలపూడికి” గౌరవ డాక్టరేట్ ప్రధానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరానికి చెందిన చింతలపూడి వెంకటేశ్వరరావుకు ఢిల్లీలో గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండర్ డా. సి.పి.యాదవ్, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ జర్వాస్ ప్రెసిడెంట్ అనుపమ త్రిగునాయత్ చేతుల మీదుగా సోమవారం ఈ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చింతలపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన కుటుంబం మొత్తం ఆయుర్వేదిక వైద్యులుగా, గ్రామీణ వైద్యులుగా ఇప్పటివరకు ప్రజలకు సేవలు అందిస్తున్నామని అదే కోవకు చెందిన తానుకూడా గత 25 సంవత్సరాల నుంచి ప్రజలకు వైద్యాన్ని అందిస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు తెలిపారు. మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య స్థాపించిన ఫౌండేషన్ లో సభ్యునిగా కొనసాగుతూ తన వంతు సంపాదన నుంచి కొంత భాగాన్ని సేవకి అంకితం చేస్తున్నానన్నారు. అదేవిధంగా డాక్టర్ సమరంతో అనేక మెడికల్ క్యాంపుల్లో పాల్గొని వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో మరియు నాకో ఫౌండేషన్ వారు హైదరాబాద్ రవీంద్రభారతిలో సేవా దృక్పథం అనే సర్టిఫికెట్లు కూడా తనకు అందజేయడం జరిగిందని. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారుకూడా తనకు గతంలో సర్టిఫికెట్ ఇవ్వడం జరిగిందన్నారు. వాటిల్లో కూడా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తర్వాత వృద్ధులకు అనాధలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేద ప్రజలకు తనలా కొంత సాయం అందించాలని ఆయన సూచించారు. ఈవిధంగా సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను తనకు ఈ డాక్టరేట్ ను మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అందించడం ఎంతో సంతోషదాయకమని చింతలపూడి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లోకాసమస్త హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఈవో డా.కె.సురేష్, స్టేట్ జనరల్ సెక్రెటరీ జి.మహేష్ నాయుడు,నెల్లూరు టౌన్ చైర్మన్ వినుకొండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *