విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన 3 వ విడుత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం గాంధీనగర్ లో నీ శ్రీ రామా ఫంక్షన్ హాల్ నందు జరిగింది. జనసేన నగర అధ్యక్షులు పోతిన మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పొలిటికల్ అఫైర్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరు అస్త్ర యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని జనసేన కార్యక్రమాలను తెలుసు కోవాలనీ చెప్పారు. పదవుల కోసం నేను పార్టీ లోకి రాలేదని, పవన్ కళ్యాణ్ విధి విధానాలు నచ్చి పార్టీలోకి వచ్చానని చెప్పారు. రాజకీయ వ్యవస్థను వైఎస్సార్సీపీ దిగజార్చిందని అన్నారు. ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా జనసేన పార్టీ ప్రతి కుటుంబానికి భద్రత కల్పించాలనే మంచి ఉద్దేశ్యంతో ప్రవేశ పెట్టింది అని తెలిపారు. సభ్యత్వం ద్వారా ప్రతి ఒక్కరికి భీమ సౌకర్యం కూడా ఉంటుందని ఆయన చెప్పారు. సభ్యత్వం తీసుకున్న వారు ప్రమాదాల బారిన పడిన అనేకమందికి ఆరు కోట్ల 70 లక్షలు భీమ అందించడం జరిగిందన్నారు. పార్టీ లో ప్రతి ఒక్కరు క్రమశిక్షణ తో ఉండాలని సూచించారు. అమరావతి అభివృద్ధిని ప్రభుత్వం చంపేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రాంతానికి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. పెట్టుబడులు గురించి మాట్లాడే నాయకులే లేరని, యువత ఉపాధి కోసం సరైన ప్రణాళిక ప్రభుత్వానికి లేదని చెప్పారు. రాష్ట్రం లో టిడ్కో ఇల్లు నేటికీ ఇవ్వలేదని, ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పార్టీలోకి నూతన అభ్యర్థులను తీసుకురావాలని, పార్టీ పట్టిష్టతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పోతిన మహేష్ మాట్లాడుతూ కార్యకర్త అధికార పార్టీ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన భయపడేది లేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు వలసులు వెళ్లే పరిస్తితి ఏర్పడింద నీ, ఆవేదన వ్యక్తంచేశారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకోని కుటుంబానికి భద్రత కల్పించాలని విన్నవించారు. నగరంలో గంజాయి విచ్చలి విడిగా దొరుకుతుందనీ దానిని అదుపు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిసెట్టి వాసు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పోతురెడ్డి అనిత, నగర ఉపాధ్యక్షులు శివశంకర్, సోమనాథం, పోలిశెట్టి వంశీ, రావి సౌజన్య , విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News