Breaking News

స్పందన వినతులకు అర్థవంత పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలకు అర్థవంత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమoలో జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ డి. కె బాలాజీ, డి ఆర్ ఓ శ్రీనివాసరావు, ఎస్ డి సి లు కోదండ రామిరెడ్డి, భాస్కర్ రాయుడు లు అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.
రెవెన్యూ శాఖకు-96, విద్యాశాఖ – 03, జిల్లా పౌర సరఫరాల శాఖ కు- 01, పోలీస్ శాఖ కు -10, మునిసిపల్ కార్పోరేషన్ – 02, పంచాయతీ రాజ్ కు – 08, డి ఆర్ డి ఎ కు -01 , హౌసింగ్ కు – 01, ఎపి ఐ ఐ సి – 01 , డి ఎం అండ్ హెచ్ ఓ – 01 , పి ఓ ఎస్ ఎస్ ఎ – 01 , ఆరోగ్యశ్రీ -01 , ఇరిగేషన్ -01 , జాతీయ రహదారులు – 01, బి సి కార్పోరేషన్ – 01, ఎస్.సి. కార్పోరేషన్ – 01 , లాండ్ అండ్ సర్వే – 02 లు కలిపి మొత్తం 132 వినతులు రావడం జరిగిందని జిల్లా అధికారులు వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాల్సిందిగా స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *