Breaking News

‘హీరో’ కంపెనీ వారి ‘జూమ్‌’ స్కూటర్‌ ఆవిష్కరణ


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ద్విచక్ర వాహనరంగంలో దూసుకుపోతున్న ‘హీరో’ కంపెనీ వారి ‘జూమ్‌’ స్కూటర్‌ మంగళవారంనాడు భారతదేశ వ్యాప్తంగా మార్కెట్లోకి విడుదల చేసినట్లు హీరో మోటార్స్‌ టిఎస్‌ఎం వాసు రుత్విక్‌ తెలిపారు. నగరంలోని కొత్త గవర్నమెంట్‌ హాస్పిటల్‌ సమీపంలోని ఆర్‌.ఎం. హీరో షోరూంనందు జూమ్‌ స్కూటర్‌ను యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, విజయవాడ చీఫ్‌ మేనేజర్‌ ముజఫర్‌ రెహ్మాన్‌ ప్రారంభించినట్లు వాసు రుత్విక్‌ చెప్పారు. డీలర్‌ మేనేజర్‌ నితూన్‌ మాట్లాడుతూ ఈ స్కూటర్‌ యొక్క ప్రత్యేకతను వివరించారు. డిజిటల్‌ మీటర్‌ విత్‌ బ్లూటూత్‌ కనెక్టివిటీ, కార్నర్‌ బెండిరగ్‌ లైట్స్‌, వెడల్పైన్‌ టైర్స్‌, వేగవంతమైన యాక్సిలరేషన్‌, ఏరో డైనమిక్‌ డిజైన్‌ సిగ్నేచర్‌ హెచ్‌ ఆకారం ల్యాంప్స్‌ జూమ్‌ స్కూటర్‌ యొక్క ప్రత్యేకతని, అలానే 110 సిసి ఇంజన్‌ సామర్థ్యంతో లీటర్‌ పెట్రోల్‌తో 50 కిలోమీటర్‌ మైలేజ్‌ వస్తుందని తెలిపారు. మార్కెట్‌లో విడుదల చేసిన మొదటి రోజే 10 వాహనాలు కస్టమర్లు కొనుగోలు చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీఎం మహేష్‌, టూ వీలర్స్‌ మెకానికల్‌ అసోసియేషన్‌ నగర అధ్యక్షులు ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *