Breaking News

ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి.

-15న ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వాల్యూస్‌ 17న ఎన్విరాన్మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు.
-ఫిబ్రవరి 26వ తేది నుండి మార్చి 7వ తేది వరకు జనరల్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు.
-మార్చి 15వ తేది నుండి ఏప్రిల్‌ 4వ తేది వరకు థీరి పబ్లిక్‌ పరీక్షలు.
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణపై మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆయన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 15వ తేదిన ఉదయం ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వాల్యూస్‌ 17వ తేది ఉదయం ఎన్విరాన్మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు.20వ తేది నుండి మార్చి 3వ తేది వరకు ఒకేషనల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 16 సెంటర్లలో నిర్వహించే ప్రాక్టికల్‌ పరీక్షలకు 830 మంది మొదటి సంవత్సరం 903 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. 26వ తేది నుండి మార్చి 7వ తేది వరకు జనరల్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని 112 సెంటర్లలో నిర్వహించే జనరల్‌ ప్రాక్టికల్స్‌కి 20,145 మంది యంపిసి విద్యార్థులు 5089 మంది బైపిసి విద్యార్థులతో కలిపి 25,234 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. మార్చి 15వ తేది నుండి ఏప్రిల్‌ 4వ తేది వరకు 86 కేంద్రాలలో ఉదయం 9 గంటల నుండి మ. 12 గంటల వరకు థీరి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పబ్లిక్‌ పరీక్షలకు 38,660 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 31,396 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు కలిపి 70,056 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని కలెక్టర్‌ తెలిపారు. పరీక్షలు నిర్వహించే సమయాలలో పరీక్ష కేంద్రాల నందు నిరంతరం విద్యుత్‌ సరఫరా చేసేలా విద్యుత్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష ప్రశ్నపత్రాలు భద్రత పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాలలో తప్పనిసరిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలలో మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు ఆదేశించారు. ఒక్కొక్క పరీక్ష కేంద్రానికి ఒక ఛీఫ్‌ సుపరింటెండెంట్‌ను నియమించడం జరిగిందని, 23 మంది కస్టోడియన్‌ అధికారులను రెండు ఫ్లైయింగ్‌ స్కాడ్‌లను, రెండు సిట్టింగ్‌ స్కాడ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షల నిర్వహణకు సుమారు 3500 మంది ఇన్విజలేటర్లను నియమించవలసి ఉందని ఇందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని రీజనల్‌ ఇంటర్మీడియట్‌ అధికారికి సూచించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేలా ఆర్‌టిసీ బస్సు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, రీజనల్‌ ఇన్‌స్పెక్షన్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారి పి. రవికుమార్‌, డిఇవో సివి రేణుక, హైపవర్‌ కమిటీ మెంబర్‌ విజయశ్రీ, డిఇసి మెంబర్లు యం శ్రీరామముర్తి, కె. యోహన్‌, టి.ఆర్యపతి ఒకేషనల్‌ డిఇసి మెంబర్‌ కె. విష్ణుకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *