-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 18న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పుణ్యస్థానాలను అచరించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
మహాశివరాత్రి పుణ్యస్నానాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డిల్లీరావు మంగళవారం ఆయన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 18వ తేదిన మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని కృష్ణానదీ తీర ప్రాంతాలలో పుణ్యస్నానాలను అచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారన్నారు. పున్నమిఘాట్, భవానిఘాట్, దుర్గా ఘాట్, విఐపి ఘాట్లతో పాటు గొల్లపూడి తుమ్మలపాలెం పవిత్ర సంగమం వద్ద భక్తులు స్నానం అచరించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పున్నమిఘాట్, భవానిఘాట్ వద్ద విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, దుర్గా ఘాట్ విఐపి ఘాట్లలో కనకదుర్గ దేవస్థానం అధికారులు జల్లు స్నానాల ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డిల్లీరావు సూచించారు. గొల్లపూడి తుమ్మలపాలెం వద్ద స్నానాలు పారిశుద్య పనులను జిల్లా పంచాయతీ అధికారులు చేయాలని పవిత్ర సంగం వద్ద ఏర్పాట్లను కొండపల్లి మున్సిపాలిటి అధికారులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్నాన ఘట్టాల వద్ద పటిష్టమైన బ్యారిగేట్లను ఏర్పాటు చేయాలని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ అధికారులు బందోబస్తును నిర్వహించాలన్నారు. స్నాన ఘట్టాలు శివాలయాల వద్ద భక్తులు పుణ్యకార్యక్రమాలు, దర్శనాలను త్వరితగతిన పూర్తి చేసేలా తగిన ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు.
సమావేశంలో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, కనకదుర్గ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్ రమ, మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమీషనర్ శ్యామల, ఇరిగేషన్ రివర్ కన్జర్వేటర్ కృష్ణారావు, డిఇవో సివి రేణుక, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News