Breaking News

వార్డ్ వాలంటీర్ల పోస్ట్ లకు ఇంటర్వ్యూలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వార్డ్ వాలంటీర్ల పోస్ట్ లకు బుధవారం డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య లు ఇంటర్వ్యూలు నిర్వహించారని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరంలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్ట్ లకు ఆన్ లైన్ ద్వారా 381 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో కొందరికి సరైన ధ్రువ పత్రాలు లేనందున వారి దరఖాస్తులు రిజెక్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఆన్ లైన్ దరఖాస్తుల పరిశీలన అనంతరం 298 మందిని అర్హులుగా ప్రకటించగా వారిలో 170 మంది ఇంటర్వ్యూకి హాజరయ్యారని తెలిపారు. వాలంటీర్లుగా ఎంపికైన వారి ఫోన్ కి మెసేజ్ వస్తుందని, ఎంపిక కాబడిన వార్డు వాలంటీర్లు ఈ నెల 17 నుండి విధుల్లోకి చేరవలసియుండునని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *