విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని 7 హిల్స్ ఫార్మసీని క్రీడారంగంతోపాటు, నగర ప్రముఖులు గోకరాజు గంగరాజు ప్రారంభించారు. 7 హిల్స్ ఫార్మసీ యజమాని, నిర్వాహకులు డేగల ప్రభాకర్ గుంటూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో ప్రారంభించి అందరి అభిమానాలు పొందుతూ ఇప్పుడు నూతనంగా విజయవాడ నక్కలరోడ్డులో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖులు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ ప్రజల కోసం అన్ని బ్రాండెడ్ మెడిసిన్స్ ఒక్కచోటే లభించేలా చేయడంతోపాటు లాభాపేక్ష లేకుండా కొనుగోలు దారులకు ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్న యాజమాన్యాన్ని అభినందించి భవిష్యత్‌లో మరిన్ని బ్రాంచ్‌లు స్థాపించి మరిన్ని సేవలు అందించాలని కోరారు. తెలుగు రాష్ట్రాలలో బ్రాండెడ్ మెడిసిన్స్‌పై అత్యధికమైన డిస్కౌంట్ ఇస్తున్న మొట్టమొదటి ఫార్మసీ అని నిర్వాహకులు తెలిపారు. ఐఎస్‌ఓ సర్టిఫైడ్ పొందటమే కాకుండా హెచ్‌ఐవి, క్యాన్సర్, షుగర్, బిపి మందులపై ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నామన్నారు. సర్జికల్ ఐటమ్స్‌తోపాటు కొన్ని ప్రత్యేక మందులపై కూడా అత్యధిక డిస్కౌంట్ ఇవ్వడమే కాకుండా, మందుల ఆర్డర్‌పై 2 గంటలలో ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తూ ఫార్మసీ రంగంలోనే అత్యధిక డిస్కౌంట్ ఇచ్చే ఏకైక ఫార్మసీ 7 హిల్స్ ఫార్మసీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, కో ఆర్డినేటర్ టి.శ్రీనివాస్, ఎపి మేనేజర్ నరసింహారావు, విజయవాడ మేనేజర్ హలీమ్ బేగ్, ఫార్మసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News