Breaking News

ఘనంగా విశ్వ మంగళ్ దివస్


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ బందర్ రోడ్ లో ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో విశ్వ ఆయుర్వేద పరిషత్ విజయవాడ విభాగ్ విశ్వ మంగళ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ విశ్వ ఆయుర్వేద పరిషత్తు ప్రపంచంలో చాలా ఆధునీకయం కాలం నుండి వస్తుందని చెప్పారు, ఆయుర్వేద వైద్యం పట్ల ప్రజలకి అనేకపోహాలు ఉన్నాయి. అపోహ లను పోగొట్టి, ప్రజలకి అందుబాటులో ఆయుర్వేద వైద్యాన్ని ప్రజల్లో అవగాహన కల్పించి అందించాలని కోరారు. ఆయుర్వేదంలో ఉండి మన పిల్లలు కూడా ఆయుర్వేద డాక్టర్లుగా తీర్చిదిద్దితేనే మనం ఆయుర్వేదాన్ని గౌరవించే ప్రేమించినట్టు అవుతుందని అదే మన పిల్లల్ని ఎంబిబిఎస్ చదివిస్తే అది ఆయుర్వేదిక్ కింద రాదని మన ఆయుర్వేదం పట్ల నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తుందని తెలిపారు. ఆయుర్వేద డాక్టర్ల మైన మనం ఆయుర్వేద మూలాలు గురించి క్షుణ్ణంగా పరిజ్ఞానం కలిగి ఉండాలని తెలిపారు. మన పూర్వీకులు ఆయుర్వేద వైద్యాలు ఏ విధంగా చేశారో దానిపై పరిశోధన చేసి పూర్తి అవగాహన కలిగి ఉంటే మంచి రిజల్ట్ వస్తదన్నారు. ఆయుర్వేద పరిశోధనలో తయారుచేసే మందు అన్ని వ్యాధులకి ఒకేలా పనిచేయదు కాబట్టి వ్యాధిని బట్టి మందు తయారు చేయాలని తెలిపారు.  సెక్రటరీ డాక్టర్ ధరణి కుమార్, ఏ ఎల్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పెటల్ సూపర్డెంట్ డాక్టర్ రాజరాజేశ్వరిలు మాట్లాడుతూ విశ్వం అంతా ఆరోగ్యంగా వుండాలని అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఆర్గానిక్ ఫుడ్, రైతులను  ప్రోత్సహించాలన్నారు. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవటానికి, వ్యాధినిరోధక శక్తి  పెంచుకోవటానికి ఆయుర్వేదం ఉపయోగపడుతుందన్నారు. ఉసిరి వాడకం, గో సంరక్షణ, రైతు సేద్యం  ఆర్గానిక్ విధానం ద్వారా నాచురల్ జరగాలన్నారు. ముందు తరాల వారికి  ఆరోగ్యం ఇవ్వాలన్నారు. అనంతరం ఎస్సై రైటింగ్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధాకర్, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వెంకటకృష్ణ , విశ్వ ఆయుర్వేద పరిషత్ ప్రెసిడెంట్  డాక్టర్ మాధవరావు చౌదరి, విజయవాడ విశ్వ ఆయుర్వేద పరిషత్ విభాగం ప్రెసిడెంట్ డాక్టర్ పూర్ణ రాజేశ్వరి మరియు ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *