Breaking News

మహిళా సాధికారత, సామాజిక అభివృద్ధి లక్ష్యాలతో ఆర్కారిస్ బ్యూటీ పెజెంట్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్


– మొత్తం నాలుగు విభాగాల్లో పోటీలు
– అశ్లీలతకు ఏమాత్రం తావులేకుండా, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా పోటీల నిర్వహణ
– సామాజిక బాధ్యత, స్ఫూర్తివంతమైన వ్యక్తిత్వమే నిజమైన సౌందర్యం
– మన మహిళలను అంతర్జాతీయ స్థాయి స్ఫూర్తిప్రదాతలుగా తీర్చిదిద్దే వేదికగా ఆర్కారిస్ బ్యూటీ పెజెంట్
– గృహహింస బాధిత మహిళల ఉపాధికి సమగ్ర తోడ్పాటు
– మహిళల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలకు ప్రాధాన్యత
– వేడుకగా ఆర్కారిస్ బ్యూటీ పెజెంట్ కర్టెన్ రైజర్
– కార్యక్రమంలో సందడి చేసిన బాలీవుడ్ భామలు మౌమిత బోస్, మేఘ్న బెనర్జీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళా సాధికారత, సామాజిక అభివృద్ధి లక్ష్యాలతో, మిస్టర్, మిస్, మిసెస్ బ్యూటీ పెజెంట్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ 2023ను నిర్వహిస్తున్నట్లు ఆర్కారిస్ నిర్వాహకులు తెలియజేశారు. బ్యూటీ పెజెంట్ ఈవెంట్ కర్టెన్ రైజర్ కార్యక్రమం సంస్థ ప్రతినిధులు, పలువురు ప్రముఖుల సమక్షంలో గురువారం వేడుకగా జరిగింది. ఏలూరురోడ్డులోని పార్క్ హయత్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ అందాల భామలు మౌమిత బోస్, మేఘ్న బెనర్జీ పాల్గొని సందడి చేశారు. ఆర్కారిస్ బ్యూటీ పెజెంట్ 2023 ఈవెంట్ బ్రోచరును ఈ సందర్భంగా నిర్వాహకులు ఆవిష్కరించారు. అనంతరం ఆర్కారిస్ డైరెక్టర్ డాక్టర్ హిమాంశు తివారీ మాట్లాడుతూ, సామాజిక బాధ్యత, దృఢమైన వ్యక్తిత్వం కలిగిన వారిని గుర్తించి, అంతర్జాతీయ స్థాయిలో స్ఫూర్తిప్రదాతలుగా నిలబెట్టే వేదికగా బ్యూటీ పెజెంట్ ఈవెంట్ కు రూపకల్పన చేశామని అన్నారు. శరీర బరువు, కొలతలతో సంబంధం లేకుండా అంతర్గత సౌందర్యానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ బ్యూటీ పెజెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బ్యూటీ పెజెంట్ నిర్వాహక సంస్థ ఆర్కారిస్ ఈవెంట్స్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ హిమాంశు తివారీ మాట్లాడుతూ, అశ్లీలతకు ఏమాత్రం తావులేకుండా, మన సంస్కృతిని ప్రతిబింబింబిస్తూ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. మిస్టర్, మిస్, మిసెస్, మిసెస్ కర్వీ అనే నాలుగు విభాగాల్లో పోటీలు జరుగుతాయని, 18 నుంచి 65 ఏళ్ల వయసు వారెవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చని అన్నారు. మనల్ని మనం ప్రేమించుకుంటేనే సాటివారిని ప్రేమించగలుగుతామని, పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగినవాళ్లే ఇతరులకు స్ఫూర్తినివ్వగలరని విశ్లేషించారు. స్ఫూర్తివంతమైన వ్యక్తులను గుర్తించి, వారిని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో బ్యూటీ పెజెంట్ 2023ను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సామాజిక అభివృద్ధి లక్ష్యంతో మహిళా సాధికారత, మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఆర్కారిస్ నిర్వహిస్తుందని అన్నారు. ఫీడ్ ఇండియాకు సహాయం అందించడం ద్వారా సామాజిక బాధ్యత కార్యక్రమాలకు మార్గదర్శనం చేస్తున్నామని డాక్టర్ హిమాంశు చెప్పారు. గృహహింస బాధిత మహిళల పునరావాసం, ఆర్ధిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నామని, ఐఐఎం లక్నో ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా మహిళలకు నైపుణ్య శిక్షణనందించడమే కాకుండా, ఏంజెల్ ఇన్వెస్టర్ల ద్వారా వారు ఆర్థికంగా స్థిరపడేలా సంపూర్ణ సహకారం అందిస్తున్నామని వివరించారు. మహిళల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంతో అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ హిమాంశు తెలియజేశారు. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ తదితర ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో ఆర్కారిస్ బ్యూటీ పెజెంట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. బ్యూటీ పెజెంట్ కు అఫీషియల్ ఛానల్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న శ్రావణి మీడియా అధినేత శ్రావణి వెన్నం మాట్లాడుతూ, మిసెస్ యూనివర్స్ సౌత్ ఈస్ట్ ఏషియా వి.వి. మంజులకుమారి మార్గదర్శకత్వంలో ఆర్కారిస్ గ్రూమింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ బ్యూటీ పెజెంట్ ఈవెంట్ జరుగుతుందని, కాన్సెప్ట్ ప్రమోటర్ గా శ్రీ మణికంఠ కన్స్ట్రక్షన్స్, క్లినికల్ పార్ట్నర్ గా యాపిల్ హెల్త్ కేర్ క్లినిక్, కవరేజ్ పార్ట్నర్ గా పాండా స్టిల్స్ బై ప్రశాంత్, బ్రాండింగ్ పార్ట్నర్ గా రీసెర్చ్ మీడియా, గ్లోబల్ సోషల్ సర్వీస్ పార్ట్నర్ గా కృష్ణనంద, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పార్ట్నర్ గా వరనాస్ హెల్త్ కేర్ అండ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్, ఫిట్నెస్ పార్ట్నర్ గా 69 వ్యవహరిస్తున్నాయని తెలియజేశారు. బాలీవుడ్ భామలు మౌమిత బోస్, మేఘ్న బెనర్జీ మాట్లాడుతూ, శక్తి స్వరూపిణి అయిన కనకదుర్గమ్మ కొలువైయున్న బెజవాడలో జరుగుతున్న మహిళా సాధికారత లక్ష్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. స్థానిక ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో పట్టం కట్టేందుకు ఈ బ్యూటీ పెజెంట్ దోహదపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిసెస్ యూనివర్స్ సౌత్ ఈస్ట్ ఏషియా వి.వి. మంజుల కుమారి, అను హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కే శ్రీదేవి,శ్రీవాణి కన్స్ట్రక్షన్స్ చైర్మన్ లయన్ మూల్పూరి సురేంద్ర, యాపిల్ హెల్త్ కేర్ సెంటర్ అధినేత డాక్టర్ రాంచంద్ చిలకపాటి తదితరులు పాల్గొన్నారు. ఆర్కారిస్ బ్యూటీ పెజెంట్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం 8949006179 నంబరులో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *