Breaking News

15వ డివిజన్ లో ప్రజల ఇబ్బందులు పరిశీలన

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌
-తూర్పు నియోజకవర్గ వై.సి.పి ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్
-డిప్యూటీ మేయర్ బెల్లం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ 15 వ డివిజన్ సర్కిల్-3 పరిధిలో గల రామలింగేశ్వర నగర ప్రాంతాలలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, తూర్పు నియోజకవర్గ వై.సి.పి ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గ గురువారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పారిశుధ్య నిర్వహణ విధానము మరియు స్థానిక ప్రజల ఇబ్బందులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. పారిశుధ్య నిర్వహణకు సంబందించి ప్రధాన రహదారులలో మరియు అంతర్గత రోడ్ల యందు ఎక్కడ డంపర్ బీన్ నిల్వ ఉండకుండా ప్రతి నిత్యం తొలగించుట మరియు సైడ్ డ్రెయిన్స్ నందు మురుగునీటి పారుదల సక్రమముగా ప్రవహించేలా చూడాలని నీటి ప్రవాహమునకు అడ్డంకిగా ఉన్న వ్యర్దాములను తొలగించి డ్రెయిన్స్ నందు మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా చూడాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. రామలింగేశ్వరనగర్ లో ఖాళీస్థలం ఉండటం గమనించి ఆ ప్రదేశంలో గ్రీనరి పెంచి పార్కులాగ అభివృద్ధి పరచాలని ఉద్యానవన శాఖ అధికారులకు ప్రపోజల్ ఏర్పాటు చేయలాని కమిషనర్ ఆదేశించారు. పటమటలంక నుండి పకీర్ గూడెం వరకు రోడ్డు వేయడానికి స్క్రూ బ్రిడ్జి క్రింద ఉన్న ఆక్రమణలను సర్వే చేసి దానికి సంబందించిన రిపోర్టును అందించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం. ప్రభాకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్రశేఖర్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, ఇంజనీర్ అధికారులు, హెల్త్ సెక్షన్ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *