విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ ఆదేశాలననుసరించి, నగరపాలక సంస్థ, విజయవాడ పరిధిలో ఉన్న 3 నియోజకవర్గములో వీధి కుక్కలకు మరియు పెంపుడు కుక్కలకు రాబిస్ వ్యాధి నిరోధిక టీకాలు కార్యక్రమము ప్రారంబించడం జరిగినది. ఈ రోజు వెస్ట్ నియోజకవర్గములో 46వ డివిజను పరిధిలో 141 సచివాలయము, సెంట్రల్ నియోజకవర్గములో 1వ డివిజన్ లో మరియు ఈస్ట్ నియోజకవర్గములో 18వ డివిజన్ లో కార్యక్రమము ప్రారంబించడమైనది. నగరములో వున్న అన్ని కుక్కలకు 6 నెలలలో టీకాలు వేయుటకు సంకల్పించడము జరిగినది. ఈస్ట్ నియోజకవర్గములో వై.కా.పా ఇన్-ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రారంభించియున్నారు. ఫ్లోర్ లీడర్ సత్యం పాల్గొనియున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఈ రోజు సుమారు 200 వీధి కుక్కలకు, పెంపుడు కుక్కలకు టీకాలు వేయించియున్నాము. రేపు అనగా, 03-03-2023న వెస్ట్ నియోజకవర్గములో 46వ డివిజనులో 143వ సచివాలయము కంట్రోల్ లో 58వ డివిజను, 2వ డివిజనులో కార్మిక నగర్ లో వాక్సిన్ లు వేయబడును. సర్కిల్ ఆఫీసు పరిధిలో వున్న సచివాలయము పరిధిలో ముందుగానే సమాచారము ఇవ్వడమైనది. ముఖ్యముగా డాగ్ లవర్స్, స్వచ్చంద సంస్థలు , ప్రజలు మరియు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అందరూ నగరపాలక సంస్థ నిర్వహించుచున్న సామూహిక వ్యాధి నిరోధిక టీకాలు కార్యక్రమములో భాగస్వామిగా అవ్వవలసినదిగా కమీషనర్ తెలియచేశారు. నాన్-వెజ్ హోటల్స్, బార్ & రేస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు మరియు ప్రజలు కుడా మిగిలిన ఆహారాన్ని వెలుపల వదిలి వేయకుండ వి.యం.సి వాళ్ళు ఏర్పాటుచేసిన డస్ట్ బిన్ లో గాని, శానిటరీ వర్కర్స్ కు గాని ఇవ్వవలసినదిగా కోరడమైనది. ఈ రోజు కార్యక్రమములో సర్కిల్స్ పరిధిలో వున్న జోనల్ కమీషనర్ మరియు ఏ.యం.ఓ.హెచ్, వి.ఏ.ఎస్.డా.ఏ.రవి చంద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News