Breaking News

అన్నదాతకు అండదండగా జగనన్న సర్కారు

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 43 లక్షల వ్యయంతో సొసైటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు ఆర్థిక ప్రగతికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. కుందావారి కండ్రికలో రూ. 43 లక్షల వ్యయంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(కెడిసిసి) నూతన భవన నిర్మాణానికి డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మ శ్రీరాములుతో కలిసి శుక్రవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కండ్రిక, పాతపాడు, సీతారామపురం, మంగళాపురం, అప్పారావుపేట, నైనవరం గ్రామాల రైతులకు మేలు చేకూరే విధంగా అధునాతన హంగులతో స్ట్రాంగ్ రూమ్ సదుపాయం ఉండేలా భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన రైతన్నలకు ఒక స్వర్ణయుగమని కితాబిచ్చారు. జనాభాలో 62 శాతం మందికి ఉపాధి అవకాశాలు కల్పించే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. వైఎస్సార్ రైతు భ‌రోసా, ఉచిత పంట‌ల బీమా ప‌థ‌కం, రాయితీ విత్తనాలు, పురుగుమందులు, యాంత్రీకీకరణ పరికరాలు వంటి సంక్షేమ ప‌థ‌కాల‌తో మూడున్నరేళ్లలో అక్షారాల రూ. లక్షా 46 వేల కోట్ల లబ్ధిని అన్నదాతలకు చేకూర్చినట్లు వివరించారు. రైతు భరోసా ద్వారా ఇప్పటివరకు 52.38 లక్షల మందికి రూ. 27 వేల కోట్లు అందించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఉచిత పంటల బీమా ద్వారా 44.28 లక్షల మందికి రూ. 6,685 కోట్ల మేలు చేకూర్చడం జరిగిందన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం కంటే అధికంగా మూడున్నరేళ్లలో రూ. 55,401 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు మల్లాది విష్ణు చెప్పారు. ఒక్క కండ్రికలోనే రూ. 5 కోట్లతో ధాన్యాన్ని సేకరించినట్లు తెలియజేశారు. అలాగే ఈ ప్రాంతంలో ఎన్.పి.ఎస్.సి. గొడౌన్ నిర్మాణానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు మల్లాది విష్ణు వివరించారు. మరోవైపు ఎన్.ఎస్.సి.బోస్ నగర్ నుంచి కుందావారి కండ్రిక వరకు రహదారి నిర్మాణానికి రూ. 3 కోట్లతో టెండర్లను పిలవగా.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు.

అనంతరం మాజీ ఎంపీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. కుందావారి కండ్రిక గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు అందిస్తోన్న తోడ్పాటు మరువలేనిదన్నారు. రూ. 15 లక్షలతో కర్మల భవనం, రూ. 35 లక్షలతో పోలవరం కాలవ నుంచి రైతుల సాగు అవసరాల నిమిత్తం తూము ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. అలాగే కండ్రిక సాగునీటి చెరువును రూ.13 లక్షలతో మరమ్మతులు చేపట్టనుండటం సంతోషదాయకమని చెప్పారు. ఈ సందర్భంగా అన్నదాతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ.. ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కనకదుర్మమ్మ దేవస్థాన ఛైర్మన్ కర్నాటి రాంబాబు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ జానారెడ్డి, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, సొసైటీ అధ్యక్షులు ఎం.రవీందర్ రెడ్డి, సభ్యులు పసుపులేటి వెంకట్రావు, దావు కోటేశ్వరరావు, పాలకేంద్రం అధ్యక్షులు దేవిరెడ్డి మంగారెడ్డి, అన్నదాతలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *