తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
చీఫ్ ఎగ్జిక్యుటివ్ సి.ఎం.ఓ.కార్యాలయ డా.సమీర్ శర్మ జిల్లాలో రెండు రోజులు పర్యటించ నున్నారని , సుస్థిర అభివృద్ది లక్ష్యాల ప్రగతి , ప్లాస్టిక్ నిషేధం, ఇ- వేస్ట్ , బ్యాటరీ డిస్పోజల్ వంటి వాటి పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించ నున్నారని, సంబంధిత శాఖల అధికారులు నివేదికలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సూచించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ వారి చాంబర్ లో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి సూచనలు చేసారు. జిల్లాలో సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధనకు చేపడుతున్న చర్యలు వాటిపై నివేదిక సిద్దం చేయాలని అన్నారు. పోల్యూషణ్ కంట్రోల్ బోర్డ్ ప్లాస్టిక్ , ఇ-వేస్ట్ , బ్యాటరీ వ్యర్థాలు పై చేపడుతున్న కార్యక్రమాల నివేదిక కూడా సిద్డంచేయాలని సూచించారు. ఈ నెల 4 న ఉదయం తిరుపతి చేరుకొని సమీక్ష నిర్వహించనున్నారని అనంతరం తిరుమలలో బస చేస్తారు. ఈ నెల 5 న తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కానున్నారని వివరించారు. ఈ సమీక్షలో జిల్లా ప్రణాళికాధికారి అశోక్ కుమార్, డి.ఎల్.డి.ఓ. సుశీలా దేవి, ఐ డి సి డి ఎస్ పిడి జయలక్ష్మి, డి.ఎం.హెచ్.ఓ శ్రీహరి ,డి.ఇ.ఓ. శేఖర్ , అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News