విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి అపోలో టైర్స్ హెల్త్ కేర్ సెంటర్,క్షయ వ్యాధి నివారణ సంస్థ యన్.టి.ఆర్ జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణలంక కరకట్టనందు క్షయ వ్యాధిపై అవగాహనను కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా సూపర్వైజర్ కె.ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ క్షయ వ్యాధినిర్మూలనలో ప్రతీఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశంతో క్రీస్తు రాజపురం, రాణీగారితోట, లబ్బీపేట లో శిభిరాలను నిర్వహించి ఈ రోజు కృష్ణలంక నందుగల రణధీర్ నగర్ లో నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. అనంతరం మాట్లాడుతూ క్షయ వ్యాధి లక్షణాలైన ఆకలి లేకపోవడం, బరువు కోల్పోవడం, రొండు వారాలకు మించి దగ్గు, తరచూ జ్వరం రావడం లోని ఏఒక్కటి ఉన్నా ఆలస్యం చేయకుండా దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రం కు గాని గవర్నమెంటు ఆసుపత్రికి గాని వెళ్ళి పరీక్ష చేయించుకోవాలని, గోరు, వెంట్రుక కు తప్ప శరీరంలో ఏ అవయవాన్నికైన క్షయ వ్యాధి సోకే ప్రమాదముందని కనుక దీనిపై ప్రతిఒక్కరూ అవగాహన ను కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఒక వేల క్షయ గా నిర్ధారణ అయితే గవర్నమెంటు వారు ఉచితంగా మందులు, ఆరు నెలల పాటు 500 వందల రూపాయలను పోషకాహారం కొరకు ఇస్తారని, కావున క్రమం తప్పకుండా మందులను తీసుకుంటే వ్యాధి తగ్గుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టి.బి హెచ్ వి శంకర్, వాసవ్య మహిళా మండలి అపోలో టైర్స్ హెల్త్ కేర్ సెంటర్ సిబ్బంది కె.శ్రీనివాసరావు, ఎ.సత్యప్రసాద్, సిహెచ్.నాగరాజు, డి.వీరాంజనేయులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News