విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్య శ్రీ పరిధిని విస్తరించి అన్ని వైద్య సేవలు దాని పరిధిలోకి తీసుకురావడమే కాకుండా ఏదైనా వైద్య సేవలకు ఆరోగ్య శ్రీ వర్తించకపోతే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ నియోజకవర్గంలో 4,16,21 డివిజన్ల సంబందిచి ముగ్గురుకి మంజూరు అయిన 1లక్ష 20వేల రూపాయల చెక్కులను తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా లంచాలకు తావులేకుండా పారదర్శకంగా ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరు జరుగుతుంది అని, గత తెలుగుదేశం ప్రభుత్వం లో జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే గాని ముఖ్యమంత్రి సహాయనిధి ఇచ్చేవారు కాదని విమర్శించారు. వైజాగ్ లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కు జగన్ గారే బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారని, ఆయనను చూసే పరిశ్రమలు పెట్టడానికి ప్రముఖులు వస్తున్నారని అన్నారు. టీడీపీ హయాంలో జరిగిన సదస్సులో మంత్రుల డ్రైవర్లు, పని వాళ్ళను తీసుకొచ్చి యంఓయూ లు చేసుకొని ప్రచారాలు చేసుకున్నారని, వాటిలో ఒక్కటి అయిన కార్యరూపం దాల్చింద అని ప్రశ్నించారు. కానీ నేడు ఆ పరిస్థితి లేకుండా పారిశ్రామిక వేత్తలు నేరుగా విచ్చేసి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా రవి,16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహదూర్,21వ డివిజన్ పుప్పాల రాజా మరియు వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News