Breaking News

మహిళల సంపూర్ణ మానసిక, శారీరక ఆరోగ్యమే దేశ ఆర్ధిక ఆరోగ్య ప్రగతికి నాంది

-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతామనే ఉద్దేశంతో మహిళల ఆరోగ్య సంరక్షలంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు .
ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెల్తీ ఉమెన్ హెల్తీ ఇండియా నినాదంతో నిర్వహించిన సైకిల్ ర్యాలీ ని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆదివారం ఉదయం పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించడం ద్వారా మరింత ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడేందుకు దోహదపడుతుందన్నారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మన పూర్వికులు కాయకష్టం కుటుంబ పనులువంటివి చేయడం ద్వారా దృఢమైన ఆరోగ్యాన్ని కలిగిఉండేవారన్నారు. ప్రస్తుతం మారుతున్నా కాలానికి అనుగుణంగా దయానందిక జీవితంలో ఎటువంటి పని చేయాలన్న మహిళలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వినియోగించడం వలన శారీరక వ్యాయామం లభించక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ వంటి అనారోగ్యాలకు అనారోగ్య పరిస్థితులకు గురిఅవుతున్నారన్నారు. మహిళలు నిత్య జీవితంలో తాను ఎంచుకున్న కుటుంబ భార్యతలతో పాటు పోటీతత్వం పెరిగి ఒత్తిడికి గురి కావడం వలన శారీరక మార్పులు చోటు చేసుకోవడం ద్వారా మోనోఫాస్ వంటి లక్షణాలతో అనేక ఇబ్బందులను ఎదురుకుంటున్నారన్నారు. కౌమార దశ నుండే సంపూర్ణమైన పౌష్టికాహారం అందించడం ద్వారా భాలికలలో ఆరోగ్యవంతమైన ఎదుగుదలతో చెల్లిగా, భార్యగా, తల్లిగా తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం దేశ ప్రగతికి బాటలు వేస్తుందన్నారు. మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టి అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థినిలకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందజేయడంతో పాటు రక్తహీనత నివారించేందుకు ఐరన్ టాబులెట్లను పంపిణీ చేసి వాటిని సద్వినియోగం చేసేలా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. అనీమియా తో బాధపడే చిన్నారులను, మహిళలను గుర్తించి వారి ఆరోగ్య పరిరక్షణపై వైదులు ప్రత్యేక శ్రద్ద తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి వైద్యాధికారులు ప్రతి కుటుంబాన్ని సందర్శించి మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి వైద్య సహాయం వాదించడడంతో పాటు ఉచితంగా మందులను పంపిణి చేస్తుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, స్వయం సహాయక బృందాల మహిళలు ద్వారా ఆరోగ్య రుగ్మతలతో బాధపడే వారిని గుర్తిచి వారికీ అవసరమైన వైద్య సహాయం అందించడం తో పాటు యోగా, వ్యాయామం వంటివి అవలంభించేలా మహిళలను చైతన్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళను ఆరోగ్యం పట్ల చైతన్యవంతులను చేసేందుకు హెల్తీ ఉమెన్ హెల్తీ ఇండియా నినాదంతో సైకిల్ ర్యాలీని నిర్వహిస్తున్న వైధ్యాధికారులు , సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు.
సైకిల్ ర్యాలీ లో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు అవుతు శైలజ రెడ్డి, బెల్లం దుర్గ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు డా. జి. సమరం, ఐసీడీస్ పిడి జి. ఉమాదేవి, జిల్లా వైద్యారోగ్యాఅధికారిణి డా. ఎం. సుహాసిని, ఉప వైద్యఆరోగ్య అధికారిణి డా. ఉషారాణి, సీనియర్ హెల్త్ ఆఫీసర్ డా. జె. నరసిమ్హ నాయక్, మలేరియా అధికారి డా. మోతిబాబు, మహిళ సంక్షేమ ప్రోగ్రాం ఆఫీసర్ డా. పద్మావతి, డా. జగదీష్, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్ వైజర్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *