Breaking News

సఖి వన్ స్టాప్ సెంటర్ భావన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయండి

-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆపదలో ఉన్న మహిళలకు సత్పర సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన సఖి వన్ స్టాప్ సెంటర్ భావన నిర్మాణ పనులను ఈ మాసాంతరం లోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న సఖి వన్ స్టాప్ సెంటర్ భావం నిర్మాణ పనులను ఆదివారం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉంది నిస్సహాయతతో ఉన్న మహిళలు, బాలికలకు సత్వర ఆశ్రయం కల్పించి సహాయం అందించేందుకు సుమారు 24 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సఖి వన్ స్టాప్ సెంటర్ భావన నిర్మాణ పనులను మార్చి మాసాంతరం లోపు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కుటుంబంలో అనేక కారణాల వలన ఎదురవుతున్న మానసిక శారీరక ఇబ్బందులను తట్టుకోలేని మహిళలు ఇంటిని విడిచి బయటకు వస్తూన్నారన్నారు. అటువంటి వారికీ తక్షణమే ఆశ్రయం కల్పించి వైద్య సహాయం, న్యాయ సహాయం అందించడం పోలీస్ ఎఫ్ ఐ ఆర్ తో పాటు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సఖి వన్ స్టాప్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో కౌన్సిలింగ్ హాల్, విశ్రాంతి గదులు, వంట గది, టాయిలెట్స్ ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా సఖి సెంటర్ ను తీర్చి దిద్ధేందుకు చర్యలు తీసుకోవలని కలెక్టర్ తెలిపారు.
సఖి వన్ స్టాప్ సెంటర్ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ అవుతు శైలజ రెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. ఉమాదేవి, సిడిపివోలు కె. మంగమ్మ, యం. నాగమణి గుత్తేదారు అవుతు శ్రీనివాస్ రెడ్డి, చైల్డ్ లైన్ జిల్లా కో ఆర్డినేటర్ అరవ రమేష్, తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *