విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజన సంక్షేమ ప్రాజెక్టులు, పథకాలకు చేపడుతున్న ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలకు 2022-23 సంవత్సరానికి సంబంధించి గ్రాంట్ ఇన్ ఎయిడ్ క్రింద నిధులు మంజూరు చేసేందుకు కొత్త, రెన్యువల్ ప్రతిపాదనలను మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కోరడం జరిగిందని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రుక్మాంగదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి చేపడుతున్న విద్యా, వైద్య జీవనోపాధి ప్రాజెక్టులు, పథకాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఆర్థిక సహాయంగా నిధులు మంజూరు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈనెల 12వ తేదీలోగా ప్రతిపాదనలను ఆన్ లైన్ వెబ్ సైట్ www.ngo.Tribal.gov.in ద్వారా సమర్పించాలన్నారు. ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛత సంస్థల నుండి అందే నూతన, రెన్యువల్ ప్రతిపాదనలకు 2025-26 సంవత్సరం వరకు నూతన మార్గదర్శకాలు అమలులో ఉంటాయన్నారు. ఆన్ లైన్ చేసిన దరఖాస్తు కాపీల రెండు ప్రతులను పూర్తి ఆధారాలు జతపరిచి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, విద్యుత్ సౌదా ప్రక్కన, విష్ణు నగర్, గుణదల, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా వారి కార్యాలయంలో అందజేయవలసి ఉంటుందని, ఇతర వివరాలకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించవచ్చునని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రుక్మాంగదయ్య ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News