Breaking News

వీధి కుక్కల వలన సమస్యలు తలెత్తకుండా నగర పాలక సంస్థ పటిష్ట చర్యలు

గుంటూరు నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజలకు వీధి కుక్కల వలన సమస్యలు తలెత్తకుండా నగర పాలక సంస్థ పటిష్ట చర్యలు తీసుకోనున్నదని, వారం రోజుల్లో నగరంలోని వీధి కుక్కలకు మాస్ యాంటి ర్యాబీస్ వ్యాక్సినేషన్ చేయనున్నామని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు తెలిపారు. సోమవారం మేయర్ ఛాంబర్లో నగర కమీషనర్ కీర్తి చేకూరి, పశు సమర్ధక శాఖ అధికారులు, నగర పాలక సంస్థ ప్రజారోగ్యాదికారులు, జంతు ప్రేమికులతో కలిసి వీధి కుక్కలా నియంత్రణ, ర్యాబీస్ వ్యాక్సినేషన్ పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలో వీధి కుక్కల వలన ఏర్పడుచున్న సమస్యల పై ప్రజల నుండి అనేక పిర్యాదులు అందుతున్నాయని, త్వరలో ఈ సమస్య పరిష్కారమయ్యేలా ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తున్నామన్నారు. వీధి కుక్కలకు యాంటి ర్యాబీస్ వ్యాక్సిన్ చేసేలా మాస్ డ్రైవ్ చేపటనున్నామన్నారు. అలాగే కుక్కలా కుటుంబ నియంత్రణకు ఏ.బి.సి కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జంతు ప్రేమికులు కూడా వీధి కుక్కల వలన ప్రజలు పడుతున్న బాధల పరిష్కారానికి నగర పాలక సంస్థ చేపట్టే చర్యలు సహకరించాలని కోరారు.కమీషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో సుమారు 20 వేలకు పైగా ఉన్న వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటానికి ఇద్దరు పశు వైద్యులను కేటాయించాలని పశుసంవర్ధక శాఖకు లేఖ వ్రాశామని, త్వరలో వైద్యులను కేటాయిస్తారన్నారు. ఆపరేషన్ల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, మౌలిక వసతుల కల్పన ఇప్పటికే సిద్దం చేశామన్నారు. సచివాలయాల వారీగా శానిటేషన్ కార్యదర్శుల ద్వారా ప్రతి వీధిలో కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స, యాంటి ర్యాబీస్ వ్యాక్సినేషన్ చేయించేలా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు.సమావేశంలో యం.హెచ్.ఓ భాను ప్రకాష్, యస్.యస్ లు రాంబాబు, ఆనంద్ కుమార్, పశుసంవర్ధక శాఖ అధికారులు, జంతు ప్రేమికులు సురేష్ కుమర్ జైన్, ప్రదీప్ కుమార్, సురేష్ జాగు, తేజోవంత్, నరసింహారావు, రామ రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *