-నగరవాసులందరికీ శ్రీ సోమాలమ్మ దేవత అనుగ్రహం కోసం ప్రార్థన చేశాను
-కలెక్టర్ డా. కె మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం నగరంలో కొలువై ఉన్న శ్రీ సోమాలమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం గాంధీపురంలో కొలువైవున్న శ్రీ సోమాలమ్మ జాతర మహోత్సవాల సందర్భముగా జిల్లా కలెక్టర్ మాధవీలత దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భముగా ఆలయ కమిటీ, అర్చకులు కలెక్టర్ దంపతులకు స్వాగతం పలకడం జరిగింది. అనంతరం పూజారులు అర్చన చేసి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ ఈనెల 3వ తేదీ నుండి 7 వ తేదీ వరకు శ్రీ సోమాలమ్మ దేవత జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నగర ప్రజలందరికీ అమ్మ వారు సుఖ సంతోషాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకోవడం జరిగిందన్నారు. ఉత్సవ ఏర్పాట్లకు సంబంధించి ఆలయ నిర్వహకులు భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, శానిటేషన్, సామియానా వంటి వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పౌర్ణమి రోజు మంగళవారం అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతుందని, నగర ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరుకున్నారు.
Prajavartha Online Telugu News