Breaking News

గ్రామ పంచాయితీ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాలపై అభ్యంతరాలుంటే తెలపండి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో నేడు గ్రామ పంచాయితీ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా అందుబాటులో ఉంచామని, అభ్య౦తరాలను సదరు మండల అభివృద్ది అధికారి / ఇ.ఓ.పి.ఆర్.డి వారికి వ్రాతపూర్వకంగా తెలియజేయాలని, వాటిపై ఈ నెల 9 న విచారణ చేపట్టి , 10 న తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె.వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం వివిధ ఆకస్మిక కారణాల వల్ల ఖాళీ గా ఉన్న 41 వార్డు మెంబర్లు, 5 సర్పంచ్ ల ఎన్నిక నిమిత్తం ముసాయిదా పోలింగ్ జాబితా ప్రకటించడం జరిగిందని అభ్యంతరాలు ఈ నెల 7 లోపు తెలియజేయాలని, 9 న పరిశీలన చేపట్టి, 10 న తుది జాబితా ప్రకటించాలని ఆం.ప్ర ఎన్నికల సంఘం అధికారి నీలం సహాని వారు షెడ్యుల్ విడుదల చేసారని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలియ జేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *