విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళా దినోత్సవం సందర్భంగా సాయంత్రం 7 గం.లకు రాజీవ్ గాంధీ పార్కు నందు విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కార్యక్రమము నిర్వహించినారు. ఈ కార్యక్రమమునకు పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణు, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమమును ప్రారంభించినారు. ఈ సభకు ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) శకుంతల అధ్యక్షతను వహించినారు.ఈ సభలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరపాలక సంస్థ నందు 37 మంది మహిళా కార్పొరేటర్లు ఉండడం మరియు ఒక మేయర్ 2 డిప్యూటీ మేయర్లు గా 3 మహిళలు ఉండటం ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహనరెడ్డి గారి గొప్పతనముగా మరియు ఈ ప్రభుత్వము యొక్క విషష్టత అని అన్నారు. అలాగే కార్పోరేషన్ H O D s లో 8 మంది మహిళలే ఉన్నారన్నారు.శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, శాసన సభ్యులు శ్రీ మల్లాది విష్ణు, వై.కా.పా ఇన్-ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ గారి చేతుల మీదుగా శాలువాలతో సన్మానించినారు.
తదుపరి మహిళా డిప్యూటీ కమిషనర్ అఫ్ పోలీస్ మేరి ప్రశాంతి. అదనపు డిప్యూటీ కమిషనర్ అఫ్ పోలీస్ శ్రీమతి వెంకట రత్నం గార్లకు మేయర్ శాలువతో సత్కరించి సన్మానించినారు.నగరపాలక సంస్థ నందు 37 మంది మహిళా కార్పొరేటర్లను శాలువ కప్పి చీరలతో సన్మానించినారు మరియు కో అప్టేడ్ మెంబర్లు టి.జయలక్ష్మి. శ్రీమతి జి.సుభాషిని గార్లకు శాలువ కప్పి చీర్లను బహుకరించినారు. తదుపరి అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) శకుంతల, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, సెక్రటరి వసంత లక్ష్మి, జోనల్ కమిషనర్ శ్రీమతి సృజన లను శాలువ కప్పి చీరలతో సన్మానించినారు.37 మంది మహిళా కార్పొరేటర్లను 8 మంది మహిళా ఆఫీసర్లను సన్మానించి మహిళల యొక్క ప్రాధాన్యత వారి యొక్క పనితీరును వారియొక్క సేవలను ఒక్కొకరి యొక్క గొప్పతనము వివరించినారు.V M C ఆఫీసులో ఉన్న మహిళా సాధికారతను చాటి చెప్పారు.
Prajavartha Online Telugu News