విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో వేగ జ్యూయలర్స్ షోరూమ్ స్థానిక బృందావన కాలనీ, నందమూరి రోడ్డులో విశాలమైన ప్రాంగణం లో ప్రారంభించారు. నాలుగు అంతస్తుల భవనంలో ఏర్పాటు చేసిన సరికొత్త షోరూమ్ ను ప్రపంచ మహిళా దినోత్స వాన్ని పురస్కరించుకుని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సినీ నటి ప్రగ్యా జైశ్వాల్‌తో కలిసి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాలకృష్ణ మాట్లాడు తూ విజయవాడలో ఏర్పాటు చేసిన వేగా జ్యూయ లర్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి రావడం ఆనందం గా ఉందన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల మహిళల కోసం నాలుగు అంతస్తుల్లో జ్యూయలర్స్ షోరూమ్ ను అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ డైరెక్టర్స్ వనమా నవీన్ కుమార్, వనమా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News