Breaking News

ఆటోనగర్ లో లింక్ ఏ.ఆర్.టి సేవలు ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి అపోలో టైర్స్ హెల్త్ కేర్ సెంటర్ నందు లింక్ ఏ.ఆర్.టి సెంటరు ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డాక్టర్ సుబ్రమణ్యం జాయింట్ డైరెక్టర్ ఎపిశాక్స్ విచ్చేసి సెంటరు ను ప్రారంబించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే ప్రధమంగా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పి.పి.పి మోడల్) ఎపిశాక్స్, స్వచ్చంద సంస్థ మరియు సి.యస్.ఆర్ (ట్రైపార్టి)తో కలిసి లింక్ ఏ.ఆర్.టి కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. నిబద్ధతతో పనిచేస్తున్న వాసవ్య మహిళా మండలి అపోలో టైర్స్ హెల్త్ కేర్ సెంటరు తో 2017లో యఫ్.ఐ.సి.టి.సి (ఫెసిలిటి ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్)న్ను ప్రారంభించడం జరిగిందని, హెచ్.ఐ.వి ని అంతమొందించేందుకు నిర్విరామంగా కృషిచేస్తున్నారని ఇప్పుడు ఇక్కడే లింక్ ఏ.ఆర్.టి సేవలను హెచ్.ఐ.వితో జీవిస్తున్నవారి కొరకు ప్రారంబించడం సంతోషాన్నిచ్చిందని ఆయన అన్నారు. దీని ద్వారా దాదాపు 800 వందల మంది లబ్ధి పొందుతారని ఆయన అన్నారు. ఉదయం 9 నుండి 5 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అనంతరం డాక్టర్ ఉషారాణి, అదనపు వైద్య అధికారి,యస్.టి.ఆర్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణా అధికారి మాట్లాడుతూ లింక్ ఏ.ఆర్.టి సేవలు విస్తరించి దిశగా జి.యఫ్.యఫ్.డి.కె.వి.యమ్.యస్.రైడ్స్ లలో కూడా త్వరలోనే లింక్ ఏ.ఆర్.టి సేవలను ప్రారంబించబోతున్నామని ప్రభుత్వ మరియు స్వచ్చంద సేవలను వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం జాన్ కిరణ్ కుమార్.ఏ.బి.యు మేనేజర్, అపోలో టైర్స్ లిమిటెడ్ మాట్లాడుతూ రవాణా రంగంలో పనిచేసే కార్మికులకొరకు దేశంలో మొత్తం 31 హెల్త్ కేర్ సెంటర్ల ద్వారా సేవలను
అందిస్తున్నమని, కార్మికుల ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు ఆవడం ఆనందాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. అనంతరం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం మాట్లాడుతూ హెచ్.ఐ.వి సోకిన వారు తీసుకునే మందులలో అనేక వెసుమార్పులు వచ్చాయని కావున అధైర్యపడకుండా పౌష్టికరమైన ఆహారంతో మందులను క్రమంతప్పకుండా వేసుకుంటూ చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితకాలం ఎంతో మెరుగుపడుతుందని ఆయన అన్నారు. అనంతరం డాక్టర్ బి.కీర్తి అధ్యక్ష్యులు, వాసవ్య మహిళా మండలి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలనుండి కార్మికుల ఆరోగ్యం మెరుగుపడేందుకు సిబ్బంది కృషి అభినందనీయం అని హెచ్.ఐ.వి/ఎయిడ్స్/క్షయ/మధుమేహం/అధిక రక్తపోటు/కంటి చికిత్స తదితర అంశాలలో కార్మికులకు నిరంతరం అవగాహన, ఆరోగ్య సిబిరాలను ఏర్పాటు చేయడం వలన వారి ఆరోగ్యం మెరుగుపడిందని అందులో పీర్ ఎడ్యుకేటర్ల సహకారం కూడా ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వాసష్య మహిళా మండలి కార్యదర్శి జి.రశ్మి, డాక్టర్ పి.దీక్ష మెడికల్ డైరెక్టర్, పి.కిరణ్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి, యమ్.వి జాన్ వెస్లీ, ప్రాజెక్ట్ అధికారి, షేర్ ఇండియా, డాక్టర్ ఉమాకాంత్, అపధానం పీర్ ఎడ్యుకేటర్లు, వాసవ్య మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *