విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరవాసులపై ఎటువంటి పన్నుల భారాలు పడకుండా వాస్తవిక బడ్జెట్ ను రూపొందించడం జరిగిందని వై.యస్.ఆర్.సి.పి. ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తన చాంబర్ నందు విలేకర్ల సమావేశములో మాట్లాడుతూ – ప్రజలకు లబ్ది చేకురేలా వాస్తవానికి దగ్గరగా వున్నబడ్జెట్ ను కౌన్సిల్ సమావేశము నందు ప్రవేశపెట్టినపుడు ప్రతి పక్షాల సభ్యులు అవాస్తవాలు మాట్లాడడం ఎంత వరకు సమంజసమని, గత పాలక పక్షం రూపొందించిన బడ్జెట్ మాదిరిగా కాకుండా బడ్జెట్ లో ఎక్కడైనా అంకెల గారడీ జరిగినదా? అంకెల గారడీచేసి రూపొందించిన బడ్జెట్ కాదు. అలాగే టిడ్కో ఇల్లు, టి.డి.ఆర్ బాండ్ల మాదిరిగా మోసం చేయలేదు, మీరే చూసుకుంటే పేద ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ కార్యక్రమములు ప్రభుత్వము వచ్చిన దగ్గర నుండి 4 సంవత్సరములు, అలాగే నగరపాలక సంస్థ నందు మేము అధికారం చేపట్టిన 2 సం.ల కాలంలో కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేస్తుంటే, దానిని చూసి ఓర్వలేక ఏమి మాట్లాడాలో తెలియక ఏదేదో మాట్లాడి అంకెల బడ్జెట్ అంటే, ఎంత వరకు సబబో నగర ప్రజలే ఆలోచించాలి. మేము కాకి లెక్కలు చూపి బడ్జెట్ రూపొందించలేదు, “బడ్జెట్ ప్రతులను సభ్యులందరికీ అందజేయడం జరిగినది”. గతములో చెత్త పన్ను రూ.25 కోట్లు వున్నదానిని రూ.10 కోట్లు చూపించినాము. గత ప్రభుత్వము రూ.200/-లు చెత్త పన్ను విధిస్తే మేము అధికారములోకి వచ్చాక రూ.30/-లకు తగ్గించినాము. ప్రపంచములో ఎక్కడా లేని విధంగా ఏ.పి. గర్వపడేలా ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొనివచ్చి గడప-గడపకు సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతీ సచివాలయానికి 20 లక్షల రూపాయల నిధులు అభివృద్ధికి కేటాయిస్తే టి.డి.పి., సి.పి.యం. సభ్యులు అవాస్తవాలు మాట్లాడుతున్నారు. మేము అందించే సంక్షేమ పథకాలైన వై.యస్.ఆర్. ఆసరా, కాపు నేస్తం, వై.యస్.ఆర్. భరోసా, విద్యా దీవెన, అమ్మ ఒడి మొదలగునవి పార్టీలకు అతీతంగా నగర ప్రజలందరికీ అందిస్తున్నాము. గతములో వారి వారి డివిజన్ లకు మాత్రమే బడ్జెట్ నందు నిధులు కేటాయించుట జరిగేదనీ, అలా కాకుండా ఏ డివిజన్ లోనైనా మేము అధికారములో లేనప్పటికీ అన్ని డివిజన్ లకు సమానంగా డివిజన్ అభివృద్ధి పనులకు రూ.30 లక్షల నిధులు కేటాయిస్తున్నాము. టి.డి.పి. సభ్యులు గుండెల మీద చేయి వేసుకొని చెప్పమనండి. మీ డివిజన్ లో అభివృద్ధి జరుగలేదా? డివిజన్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేదా? తెలుసుకోండి. ఏది ఏమైనప్పటికీ అన్ని వర్గాల ప్రజలకు లబ్ధిని చేకూర్చేలా ఎటువంటి అధిక భారము లేకుండా నగర అభివృద్ధికి ఉపయోగపడేలా రూపొందించిన వాస్తవిక బడ్జెట్ ఆమోదించినందులకు సభ్యులకు, అధికారులకు ధన్యవాదములు.
అదే విధముగా డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ మరియు ఆవుతు శ్రీశైలజ మాట్లాడుతూ…
మేయర్ గారు ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్ ప్రజలకు చేరువగా వుండే బడ్జెట్ అందించుట జరిగినది. ప్రతిపక్ష నాయకులు అవాస్తవాలు మాట్లాడం సరికాదు. పూర్తి స్థాయి సమాచారముతో అభివృద్ధిని తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. రాష్ట్ర ప్రభుత్వము కాపు నేస్తం ద్వారా అందిస్తున్నఅనేక సంక్షేమ పథకాలు వారికి తెలియనివా?. సచివాలయాలకు నిధులా కేటాయింపు నగరములో రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి, మంచినీటి సరఫరా మెరుగుదల మొదలగు అనేక మౌళిక సదుపాయాలు 3 నియోజక వర్గాల్లో సమానంగా చేస్తూ వుంటే జరుగుతున్న అభివృద్ధి చేసి ఓర్వలేక ప్రతిపక్షాలు తప్పుడు మాటలు మాట్లాడటం సమంజసం కాదని అన్నారు.
Prajavartha Online Telugu News