Breaking News

ప్రతి చిన్నారికి నులిపురుగుల నివారణ మందు అంందించేందుకు చర్యలు తీసుకోండి..

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రతి చిన్నారికి నులిపురుగుల నివారణ మందు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 14వ తేదిన జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న నులిపురుగుల నివారణ దినోత్సవ ( నేషనల్‌ డివార్మింగ్‌ డే) కార్యక్రమం పై గురువారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆయన కార్యాయలం నుండి వైద్య ఆరోగ్య, విద్య, సాంఫీుక సంక్షేమం, మున్సిపల్‌, మహిళ శిశు సంక్షేమ, తదితర శాఖల అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ చిన్నారులలో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న నులిపురుగులను నివారించి ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా ఈనెల 14వ తేదిన నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి చిన్నారికి నులిపురుగుల నివారణ (అల్‌బెండజోల్‌) మాత్రను తప్పక వేయించాలన్నారు. జిల్లాలో 4 లక్షల 50 వేల మందికి నులిపురుగుల నివారణ మందును సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్థేశించడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి 4 లక్షల 78 వేల నులిపురుగుల నివారణ మందు డోస్‌లను సిద్దం చేయడం జరిగిందన్నారు. పంపిణీ చేసిన మందులను చిన్నారులకు అందజేసేందుకు ప్రణాళికను రూపొందించి అమలు చేయాలన్నారు. 1 నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 6 సంవత్సరాలు నిండి 19 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలకు పాఠశాలలు కళాశాలలో మందును పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 1 నుండి 2 సంవత్సరాల చిన్నారులకు 200 మి. గ్రా. (సంగం) ట్యాబ్‌లెట్‌ 2 నుండి 19 సంవత్సరాల వయస్సు వారికి 400 మి. గ్రా. ట్యాబ్‌లెట్‌ ఒక్కొక్కటి చొప్పున పంపిణీ చేసి వినియోగించేలా పర్యవేక్షణ చేయాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌, ప్రభుత్వ ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల అధ్యాపకులు, ఆశకార్యకర్తలు, వసతి గృహ సంక్షేమ అధికారులు, కార్యక్రమంలో పూర్తిగా భాగస్వామ్యులు అయ్యేలా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జూమ్‌ కాన్ఫరెన్స్‌లో డియంహెచ్‌వో డా. యం సుహాసిని, ఐసిడిసి పిడి జి. ఉమాదేవి, డిఇవో సివి రేణుక, గిరిజన సంక్షేమ అధికారి యం. రుక్మాంగదయ్య, సోషల్‌ వెల్ఫేర్‌ యం.వి విజయభారతి తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *