Breaking News

విద్యుత్ స్తంభాలను షిఫ్ట్ చేయడానికి డిమాండ్ చెల్లించిన ప్రాంతాల్లో వెంటనే షిఫ్ట్ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో రోడ్ల విస్తరణ చేస్తున్న ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలను షిఫ్ట్ చేయడానికి డిమాండ్ చెల్లించిన ప్రాంతాల్లో వెంటనే షిఫ్ట్ చేయాలని సిపిడిసిఎల్ అధికారులను నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశించారు. గురువారం కమిషనర్ నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులలో ఇతర శాఖల సమన్యయం, నాడు-నేడు పనులు, హౌసింగ్, త్రాగునీటి సరఫరా తదితర అంశాల పై నగరపాలక సంస్థ ఇంజినీరింగ్, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఏళ్ళ తరబడి పెండింగ్ లో ఉన్న రోడ్ల విస్తరణ పనులు వేగంగా చేపడుతున్నామని, విస్తరణ పనులు జరిగిన ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాల షిఫ్తింగ్ కు డిమాండ్ చెల్లించినా పెద్ద పలకలూరు, కుగ్లర్ హాస్పిటల్ రోడ్, నందివెలుగు రోడ్ తదితర ప్రాంతాల్లో స్తంభాలు షిఫ్ట్ చేయలేదని, రానున్న వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని సిపిడిసిఎల్ అధికారులకు స్పస్టం చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో విద్యుత్ విభాగంకు అదనంగా మరో ఇద్దరు ఏ.ఈ.లను కేటాయించామని, ప్రజల నుండి వీధి దీపాలు, ఇతర విద్యుత్ సంబందిత సమస్యల పై అందే ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని మరుగుదొడ్లు, ట్రాఫిక్ ఐలాండ్స్ మరమత్తులు చేపట్టాలని, డివైడర్లకు పెయింటింగ్ చేయించాలని ఏ.ఈ.లను ఆదేశించారు. నిర్మాణ దశలో ఉన్నరెండు వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను త్వరగా పూర్తీ చేసి ప్రారంభానికి సిద్దం చేయాలన్నారు. అలాగే 15 ఫైనాన్స్ కమిషన్ నిధులతో చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్దం చేయాలన్నారు. గాంధీ పార్క్, కౌన్సిల్ హాల్ పనులు వేగవంతం చేయాలని ఈ.ఈ.లు నేరుగా పనులను పర్యవేక్షణ చేయాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో విధులు నిర్వహించే యుజిడి కార్మికులకు సేఫ్టి కిట్స్, పారిశుధ్య కార్మికులకు యాప్రాన్స్, గ్లౌజుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఎస్.ఈ.ని ఆదేశించారు. కోర్ట్ కేసుల్లో నిర్దేశిత గడువులోగా కౌంటర్స్, అఫిడవిట్స్ వేయాలన్నారు. సమావేశంలో ఎస్.ఈ. భాస్కర్, సి.ఎం.ఓ.హెచ్. డాక్టర్ విజయలక్ష్మీ, ఎం.హెచ్.ఓ. డాక్టర్ భాను ప్రకాష్, ఈ.ఈ.లు సుందర్రామిరెడ్డి, కొండారెడ్డి, కోటేశ్వరరావు, ఏపిసిపిడిసిఎల్ ఈ.ఈ. శ్రీనివాసబాబు, ఏడిహెచ్ రామారావు, నగరపాలక సంస్థ, సిపిడిసిఎల్ డిఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *