Breaking News

వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 12 సంవత్సరాలు పూర్తి అయ్యి 13వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మార్చి 12వ తేదీన తూర్పు నియోజకవర్గంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఈమేరకు పత్రిక ప్రకటన విడుదల చేసిన అవినాష్ సంక్షేమ పాలనతో పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయసాధనకు మన ప్రియతమా నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి 2011 మార్చి12న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగిందని, గడచిన 12ఏళ్ల కాలంలో ఎన్నో సవాళ్లు అధిగమించి సంపూర్ణ ప్రజా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా దాదాపు 98శాతం పైగా హామీలు అమలు చేసి జనరంజకంగా పరిపాలన అందిస్తున్నారని అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 12వ తేదీన తూర్పు నియోజకవర్గంలో ని అన్ని డివిజన్ లలో పార్టీ నాయకులు పార్టీ జెండాలు ఎగురవేయలని, వైయస్సార్ గారి విగ్రహాలకు రంగులు వేసి పూలమాలలతో అలంకరించి సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టి వేడుకలు నిర్వహించాలని అవినాష్ పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *