Breaking News

ఏప్రిల్‌ 3 నుండి 18వ తేది వరకు పదవ తరగతి పరీక్షలు..

-పరీక్షలకు పకడ్బంది ఏర్పాట్లు చేయండి..
-జిల్లాలో 154 కేంద్రాలలో 30,134 మంది హాజరుకానున్న విద్యార్థులు..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏప్రిల్‌ 3వ తేది నుండి జిల్లాలో నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలకు 154 కేంద్రాల ద్వారా 30,134 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్భంది ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఏప్రిల్‌ 3వ తేది నుండి జిల్లాలో నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణపై శుక్రవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు నగరంలోని ఆయన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 3వ తేది నుండి 18వ తేది వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించడం జరిగిందన్నారు. పదవ తరగతి పరీక్షలకు సంబంధించి జిల్లాలో 154 పరీక్ష కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. 30,134 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. వీరిలో 15,530 మంది బాలురు,14,604 మంది బాలికలు ఉన్నారన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులలో 27,329 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, 2,805 మంది సప్లమెంటరీ విద్యార్థులు ఉన్నారన్నారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను భద్రపరిచేందుకు 35 పోలీస్‌ స్టేషన్‌లను స్టోరేజ్‌ కేంద్రాలగా గుర్తించడం జరిగిందన్నారు. పరీక్షల నిర్వహణకు ఇద్దరు అదనపు డిపార్టిమెంట్‌ అధికారులను , ఐదు ఫ్లైయింగ్‌ స్కాడ్‌లను, సి కేటగిరి కేంద్రాలకు 14 మంది రూట్‌ ఆఫీసర్లను, అదనంగా మరో 12 మంది రూట్‌ ఆఫీసర్లను ఏ,బి కేంద్రాలకు నియమించామన్నారు. 12 అసిస్టెంట్‌ రూట్‌ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రాలకు 1,354 ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. పరీక్షల అనంతర 19వ తేది నుండి 26వ తేది వరకు స్పాట్‌ వాల్యేషన్‌ నిర్వహించేందుకు బిషప్‌ అజరయ్య పాఠశాలను గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. పరీక్షల కేంద్రాల సమీపంలో 144 సెక్షన్‌ అమలు చేయడంతో పాటు 100 మీటర్ల పరిధిలో జిరాక్స్‌ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్లైయింగ్‌ స్కాడ్‌లకు సంబంధించి అవసరమైన డిప్యూటి తహాశీల్థార్లను నియమించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారికి సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తుని ఏర్పాటు చేయడంతో పాటు స్పాట్‌ వాల్యేషన్‌ చేయనున్న బిషప్‌ అజరయ్య పాఠశాల వద్ద 24 గంటలు పోలీస్‌ ఆర్మ్‌డు గార్డ్స్‌తో పోలీస్‌ పహారాకు ఏర్పాటుకు పోలీస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు చేరవేసేందుకు 12 క్లోజుడ్‌ కంటైనర్‌ వాహనాలను సిద్దం చేయాలని డిప్యూటి ట్రాన్స్‌ఫోర్ట్‌ అధికారికి సూచించారు. ఏప్రిల్‌ 3 నుండి 18వ తేది వరకు పరీక్ష కేంద్రాలలో నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా రాత్రి వేళలో విద్యుత్‌ సరఫరా చేసేలా విద్యుత్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని పరీక్షల కేంద్రాలకు విద్యార్థులు చేరుకునే విధంగా ఆయా సమయాలలో ఆదనపు బస్సులను ఏర్పాటు చేయాలని హాల్‌టిక్కెట్‌ కలిగిన విద్యార్థులకు ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ఏపిఎస్‌ఆర్‌టిసి అధికారులను ఆదేశించారు. పట్టణాలలో మున్సిపల్‌ అధికారులు గ్రామాలలో మండలాభివృద్ధి అధికారులు పరీక్ష కేంద్రాలను నిర్వహించే పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రా వద్ద ప్రధమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్య అధికారులను ఆదేశించారు. ఎటి పరిస్థితులలోను పరీక్ష కేంద్రాలలోనికి మొబైల్‌ ఫోన్‌లను, ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించరాదని, జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. సమావేశంలో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, డిఇవో సివి రేణుక, డిటిసి పురేంద్ర, నగరపాలక సంస్థ అడిషినల్‌ కమీషనర్‌ శ్యామల, ఏపిఎస్‌ఆర్‌టిసి డిపో మేనేజర్‌ ఏ. వెంకటేశ్వరరావు, విద్యుత్‌ శాఖ ఇఇ యు. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *