-కదిరి ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు పెందుర్తి శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డొల్ల కంపెనీలు సృష్టించి వైజాగ్ లో ఉన్న భూములు దోచుకొని పంచుకునేందుకే పెట్టుబడుల సమ్మిట్ ఈవెంట్ నిర్వహించారని, జరిగిన సమ్మిట్ లో వాస్తవాలు నిజమైన ఎమ్ వో యులు, ఆ వ్యవస్థల ఆర్థిక పరిస్థితులు ఆధారాలతో పబ్లిక్ డొమైన్ లో పెట్టీ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందని, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులను ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉద్యోగాలు తెస్తున్నామని నమ్మించే ప్రయత్నం భాగంగానే ఈ ఈవెంట్ జరిగిందని, వైజాగ్ వెళ్ళిపోతున్నానని చెపుతున్న జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో భూములు ఆన్లైన్ అమ్మకాలు ఎలా చేస్తారో చెప్పాలని ఆన్లైన్ బూటకంతో ప్రధాన ప్రాంతంలో భూమి దక్కించుకునే ప్రయత్నమేనని టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రులను పెట్టుబడుల సమ్మిట్ పేరుతో నమ్మించాలనుకున్న జగన్ మోహన్ రెడ్డి రాయలసీమకు ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి ఎన్ని ఉద్యోగాలు తెస్తున్నారు చెప్పగలరా అని శ్రీనివాస్ ప్రశ్నించారు.
Prajavartha Online Telugu News