Breaking News

ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్, మధ్యంతర స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

-నిస్పాక్షికమైన ప్రశాంత వాతావరణం లో ఎన్నికల నిర్వహణ: కలెక్టర్

సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం నెల్లూరు చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం మరియు ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లు, మధ్యంతర స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూళ్లూరుపేట ను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె వెంకట రమణ రెడ్డి ఆర్డీవో సూళ్లూరుపేట చంద్రముని తో కలిసి పరిశీలించి పలు సూచనలు చేసారు. శనివారం సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల సూళ్లూరుపేట లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు మరియు మధ్యంతర స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారుల చెక్లిస్ట్ ఆధారంగా సూచించిన దాదాపు 43 రకాల వస్తువులను తప్పనిసరిగా డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషణ్ కేంద్రాల నుండి పంపిణీ జరిగేలా చూడాలని అన్నారు. కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లైటింగ్ త్రాగునీరు మరుగుదొడ్లు బేరికేడింగ్ ఏర్పాట్లు ఉండాలని సూచించారు.

సూళ్లూరుపేట లోని 25 పోలింగ్ కేంద్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పివోలు ఓపిఓలకు రెండు రోజుల శిక్షణ పూర్తయిందని, ప్రిసైడింగ్ అధికారులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ సామాగ్రిని సరిచూసుకొని వారికి కేటాయించిన వాహనంలో పోలీస్ బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలకు 12 వ తేదీ చేరుకొని ఈ నెల 13న నిర్వహించబడే ఎమ్మెల్సీ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజక వర్గ ఎన్నికల నిర్వహణను బాధ్యతయుతంగా చేపట్టాలని సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు ఉందనీ, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వెలుపల వీడియోగ్రఫీ ఏర్పాటు అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సూళ్లూరుపేట నియోజక వర్గంలోని 25 పోలింగ్ కేంద్రాలను ఐదు సెక్టార్లుగా విభజించి రూట్ ఆఫీసర్లను అనుసంధానం చేసామని తెలిపారు. నేటి సాయంత్రం 4 గంటల నుండి 144 సెక్షన్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అమలులో ఉంటుందని, మద్యం దుకాణాలు బార్లు ఈ నెల 13వ తేదీ సాయంత్రం 4గంటల వరకు మూసివేయాలని తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేలా అన్ని చర్యలు ఉండాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో మరియు పోలింగ్ కేంద్రాల లో ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి నాణ్యమైన భోజనం, వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. వీరి వెంట సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, సంబంధిత తాసిల్దార్లు, సెక్టో అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *