అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
AIIMS మంగళగిరిలో రోగుల సంరక్షణ ప్రయాణం నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డైరెక్టర్ & CEO, ప్రొఫెసర్.(డాక్టర్.) ముఖేష్ త్రిపాఠి మరియు డాక్టర్ జాయ్ ఏ ఘోషల్, డీన్ (అకడమిక్), డాక్టర్ శ్రీమంత కుమార్ దాష్, డీన్ (పరీక్షలు), డాక్టర్ దీప్తి వేపకొమ్మ, డీన్ (పరిశోధన), డాక్టర్ వినీత్ థామస్ అబ్రహం, మెడికల్ సూపరింటెండెంట్, డాక్టర్ శంకరన్, మీడియా సెల్ చైర్మన్ &డా.కె.వంశీకృష్ణా రెడ్డి, మీడియా సెల్ ప్రతినిధి తదితరులందరూ సోమవారం ఆడిటోరియంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
డైరెక్టర్ & CEO ఇన్స్టిట్యూట్ యొక్క పురోగతిని వివరించారు. అలాగే 12 మార్చి, 2019 నుండి ఇప్పటి వరకు AIIMSలో రోగుల సంరక్షణ ప్రయాణం సాగించిన తీరుని వివరించారు. 12.03.2019న రోజుకు మొత్తం ఔట్ పేషెంట్‌ల సంఖ్య 44 మంది ఉండగా, ప్రస్తుతం రోజుకు సగటున 2,400 – 2,500 మంది రోగులకు ఆ సంఖ్య పెరిగిందని ఆయన చెప్పారు. 11.03.2023 వరకు మొత్తం 9,67,192 మంది రోగులు ఔట్ పేషెంట్ సేవలను పొందారు. నాలుగు సంవత్సరాల వ్యవధిలో, ఇన్‌పేషెంట్ సేవలు (555 పడకలు ఇప్పుడు పనిచేస్తున్నాయి), ICU సేవలు, OT సేవలు (06 OTలు ఇప్పుడు పని చేస్తున్నాయి) &ట్రామా మరియు అత్యవసర సేవలు పని చేస్తున్నాయని కూడా ఆయన వివరించారు. 256 స్లైస్ సిటి, 3టి ఎంఆర్‌ఐ, హై ఎనర్జీ లినాక్, లో ఎనర్జీ లినాక్, హై డోస్ బ్రాకీథెరపీ, 128 స్లైస్ సిటి సిమ్యులేటర్, rTMS& PET CT సౌకర్యాలు వంటి అన్ని అడ్వాన్స్డ్ పరికరాలు అందుబాటులోకి తెచ్చామని, వాటన్నింటి సహకారంతోనూ ఇనిస్టిట్యూట్‌లో చేరే రోగులకు అధునాతన క్యాన్సర్ కేర్ అందిస్తున్నామని ఆయన తెలిపారు. అధ్యాపకులు ఆయా విభాగాల్లోకి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు కార్డియాలజీ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన సేవలను అందించాలనే ఆదేశాన్ని ఇన్‌స్టిట్యూట్ నెరవేరుస్తోందని, ఈ దిశగా PM-JAY/Dr.YSRఆరోగ్యశ్రీ సేవలను కూడా ఇన్‌స్టిట్యూట్‌లో ప్రారంభించామని ఆయన నొక్కి చెప్పారు. OPD నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కూడా అమలు చేస్తున్నామని ఆయన అన్నారు.
మెడికల్ సూపరింటెండెంట్ ఇన్‌స్టిట్యూట్‌లోని అన్ని విభాగాలలో అందుబాటులో ఉన్న రోగుల సంరక్షణ సేవల గురించి క్లుప్త వివరణ ఇచ్చారు (కాపీ జతచేయడం జరిగింది). అధునాతన కంటిశుక్లం &రెటీనా సర్జరీలు, లాపరోస్కోపిక్ సర్జరీలు, హిప్ &మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు, ఆర్థ్రోస్కోపీ సర్జరీలు వంటి వివిధ శస్త్రచికిత్సలు ఇన్‌స్టిట్యూట్‌లో క్రమం తప్పకుండా జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
ఆయన మాట్లాడిన అనంతరం ఇన్‌స్టిట్యూట్‌లో తాము పొందిన సేవల గురించి కొంతమంది రోగులు తమ అనుభవాలు &అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌బీఐ పెన్షనర్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సంస్థతో తమ అనుబంధాన్ని పంచుకుంటూ ప్రముఖులకు జ్ఞాపికను అందజేశారు. నాలుగు సంవత్సరాల రోగుల సంరక్షణ ప్రయాణం మరియు సాధించిన వివిధ మైలురాళ్ల చిత్రమైన ప్రాతినిధ్యంపై బ్రోచర్‌ను ఆవిష్కరించారు.దానిని మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు
Prajavartha Online Telugu News