-జేటీసీగా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ శ్రీదేవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని సంయుక్త రవాణా కమిషనర్ (జేటిసి) సిహెచ్ శ్రీదేవి అన్నారు. స్థానిక బందరు రోడ్డు లోని డీటీసీ కార్యాలయంలో సోమవారంనాడు జేటిసి గా సిహెచ్ శ్రీదేవి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జేటిసి శ్రీదేవికి శాలువా కప్పి, పుష్పగుచ్చేముతో డిటిసి ఎం పురేంద్ర అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జేటిసి శ్రీదేవి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు జోన్ లో ఉన్న ఏడు జిల్లాలలో ప్రత్యేక చర్యలు చేపడతామని, ప్రమాద రహిత జోన్ గా తీర్చిదిద్దే దానిలో అందరి సహకారంతో ప్రజలలో అవగాహన కల్పిస్తామన్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాహన బకాయి పన్నులు వసూలు చేసి ప్రభుత్వంనకు ఆదాయం వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. రవాణాశాఖలో అవలంబిస్తున్న నూతన విధానం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ ఐ సి) ను సమర్థవంతంగా నిర్వహించి, ప్రజలలో అవగాహన కల్పించడంతోపాటు పారదర్శకంగా సేవలందించేలా మరేంత కృషి చేస్తామన్నారు. జెటిసి శ్రీదేవికి అభినందనలు తెలిపిన వారిలో ఆర్టీవో ఆర్ జగదీశ్వర్ రాజు, మోటార్ వాహన తనిఖీ అధికారులు ఆర్ ప్రవీణ్, ఎస్ శ్రీనివాస్, ప్రియదర్శిని, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు, కార్యాలయ అధికారులు సిహెచ్ శ్రీనివాసరావు ఆర్ చంద్రకళ , ఉద్యోగులు కేవీపీ నాగమురళి, బి జ్యోతి, కే రామచంద్రరాజు జోగారావు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News