రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ఉచిత న్యాయ సేవలను అందించేందుకు న్యాయ విభాగం మరియు గౌరవ నల్సా వారు “న్యాయ బంధు”, “టెలీ లా ఫర్ సిటిజెన్స్” యాప్ లను ప్రవేశపెట్టారని తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాప్ ల ద్వారా ప్రజలు న్యాయ సేవలను పొందవచ్చనని తెలిపారు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు గూగుల్ ప్లే స్టోర్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వారి న్యాయ బంధు(DoJ) మరియు టెలీ లా ఫర్ సిటిజెన్స్(DoJ) నుండి ఇంస్టాల్ చేసుకొని వారి వ్యక్తిగత వివరాలతో ఈ యాప్ లలో నమోదు చేసుకోవాలి. తరువాత యూజర్ ఐ.డి., పాస్ వర్డ్ తో లాగ్ ఇన్ అయ్యి వారు ఉన్న చోట నుండే న్యాయ సేవలను పొందగలరని అన్నారు. న్యాయ సేవాధికార సంస్థల చట్టం, 1987 సెక్షన్-12 ప్రకారం మహిళలు, 18 సంవత్సరాలు నిండని పిల్లలు, ఎస్.సి., ఎస్.టి. వర్గాల వారు, మొదలగు వారు ఈ సేవలను పొందుటకు అర్హులని న్యాయమూర్తి తెలియజేశారు. జిల్లాలో న్యాయ బంధు, టెలీ లా యాప్ ల ద్వారా ఉచిత న్యాయ సేవలు, న్యాయ సలహాలను అందిస్తున్నామని అన్నారు. ప్రజలు ఈ ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
మార్చి 18 న ప్రత్యేక అదాలత్:
రాజమహేంద్రవరం, అమలాపురం , కాకినాడ , పెద్దాపురం , పిఠాపురం , రామచంద్రపురం , రాజోలు , ఆలమూరు , తుని , ముమ్మిడివరం , కొత్తపేట , ప్రత్తిపాడు , అనపర్తి , రంపచోడవరం , అడ్డతీగల ఈ స్పెషల్ లోక్ అదాలత్ నందు, కోర్టులలో పెండింగ్ లో ఉన్న కుటుంబ తగాదాలు (Family Disputes), వినియోగదారుల కేసులు (Consumer Matters), పాక్షిక న్యాయ అధికార సంస్థల నందు పెండింగ్ లో ఉన్న మేధో సంపత్తి హక్కుల కేసులు (Intellectual Property Rights Matters) రాజీమార్గం ద్వారా పరిష్కరింపబడునని తెలిపారు.
Prajavartha Online Telugu News