Breaking News

13 సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు మార్చి 18 న వాక్ ఇన్ ఇంటర్వ్యూ లు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 13 సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు మార్చి 18 న వాక్ ఇన్ ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నట్లు జీ జీ హెచ్ సూపరింటెండెంట్ డా ఆర్. రమేష్, ప్రిన్సిపాల్ డా ఏ. వేంకటేశ్వర రావు లు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలియ చేశారు.

రాజమహేంద్రవరం లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే దిశలో జిల్లా ఆసుపత్రిని  ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి స్థాయి ని పెంచినట్లు జీ జీ హెచ్ సూపరింటెండెంట్ డా ఆర్. రమేష్ తెలిపారు. ప్రస్తుతం ఈ బోధనా ఆసుపత్రి స్థాయి ని 350 బెడ్స్ కి పెంచడం జరిగిందన్నారు. రానున్న మూడు నాలుగేళ్లలో 600 బెడ్స్ స్థాయి కి ఆసుపత్రిని ఆధునిక వైద్య అందించే సామర్థ్యం మేరకు పెంచడం జరుగుతుందని అన్నారు. జాతీయ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆసుపత్రి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదికి 350 బెడ్స్ నుంచి 430, తదుపరి ఏడాది 500 బెడ్స్ కు పెంచుకుంటూ 600 బెడ్స్ స్థాయి కి అభివృద్ధి చేస్తూ అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలను సరఫరా చేశారని అన్నారు. భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా వసతులు, మెడికల్ ఎక్విప్మెంట్ సరఫరా చెయ్యడం జరుగుతుందని రమేష్ తెలిపారు. రానున్న ఏప్రిల్, మే నెలల్లో ఆమేరకు యంత్ర పరికరాలు సరఫరా కి ఎన్ ఎమ్ సి అంగీకారం తెలిపిందన్నారు. తదనుగుణంగా అందించే వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంచుతున్నట్లు తెలియచేశారు. గతంలో కంటే మరింత మెరుగైన వైద్య సేవల్లో భాగంగా ప్రత్యేక వైద్య సేవలు, పరీక్షలు,  ఐ సి యూ, ఆపరేషన్స్, వార్డ్స్ ఆధునీకరించి నట్లు తెలియ చేశారు. భోధన ఆసుపత్రి గా మార్పు చేసిన దృష్ట్యా గతంలో కంటే మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈక్రమంలో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు పోస్టుల నియామకం కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నామని, ఆసక్తి ఉన్న అనుభవజ్ఞులు అయినా డాక్టర్లు మార్చి 18 న జరిగే ఇంటర్వ్యూస్ కి హాజరు కావాలని డా . రమేష్ విజ్ఞప్తి చేశారు.

ఈ ఏడాది (2023) ఆగస్ట్ నెలలో ప్రభుత్వ వైద్య కళాశాల కి చెందిన మొదటి బ్యాచ్ కి చెందిన 150 మెడికల్ సీట్లు భర్తీ చేయడం జరుగుతుందని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా ఏ. వేంకటేశ్వర రావు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఆసుపత్రిని జూలై ఒకటి 2022 న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి గా మార్పు చేస్తూ 112 మంది బోధనా వైద్య సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. వారిలో 100 మంది వరకు బోధనా వైద్య అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. తద్వారా మొత్తం 14 విభాగాల్లో వైద్య సేవలు అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ ఆసుపత్రికి 54 మంది ఎస్ ఆర్ (సీనియర్ రెసిడెంట్) డాక్టర్ల పోస్టులు మంజూరు చేయగా చాలా వరకు డాక్టర్లు విధుల్లో చేరడం జరిగిందన్నారు. సుమారు ఖాళీగా ఉన్న 13 పోస్టుల భర్తీకి మార్చి 18 న వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ నిర్వహించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు వెంకటేశ్వర రావు తెలిపారు. ఫిబ్రవరి 3 వ తారీఖున జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ ఎం సి) బృందం తనిఖీకి రావడం జరిగిందని అన్నారు. ఆసుపత్రి భవనాలు నిర్మాణం పురోగతిలో ఉన్నట్లు నివేదిక ఇవ్వడం జరిగిందని, మార్చి నెలాఖరునాటికి పెండింగు పనులు పూర్తి చేస్తామని ఎన్ ఎమ్ సి కు తెలియ చేశామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *