Breaking News

వ్యవసాయ, అనుబంధ సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాలుగా చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ, అనుబంధ సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు అన్నారు. రానున్న రబీ సీజన్లో గన్ని బ్యాగులను ఆయా కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కంటే వినయ్ తేజ్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ, జలవనరుల, పౌర సరఫరాల, మార్కెటింగ్, విద్యుత్, పిఆర్, ఉద్యాన వన శాఖ లకు చెందిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్. మాధవరావు మాట్లాడుతూ, వ్యవసాయ పంటల సాగు సమయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరింత మెరుగైన ఫలితాలు కలుగుతాయని తెలిపారు. రానున్న రబీ సీజన్ కోసం మార్చి 25 నుంచే కోతలు జరుగుతున్న ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.

అనంతరం మండలాలు వారీగా పేర్కొన్న వివిధ అంశాలపై సమావేశంలో ఆశావహ దృక్పథంతో సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ ద్వారా కొన్ని చోట్ల కాలువల పూడిక తీత, గుర్రపు డెక్కల తొలగింపు చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ ద్వారా వ్యక్తిగత యంత్ర పరికరాలు, ఈ క్రాప్, యూనిట్ విద్యుత్ ధర 50 పైనలకు, పౌర సరఫరాల, మార్కెటింగ్ కి చెంది మార్చి నెలాఖరుకి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, సెనగలు కొనుగోలు , హమాలీ చార్జీల పెండింగు చెల్లింపులు కోసం సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు. విద్యుత్ సరఫరా 9 గంటలు ఇవ్వాలని, ఉద్యానవన శాఖ కి చెంది పామాయిల్ రాయితీ కోసం కోరడం జరిగింది. తదుపరి ఆయా అంశాల వారీగా జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు ఆయా శాఖల ద్వారా చేపడుతున్న చర్యలను వివరించారు. కొనుగోలు కేంద్రాలు మార్చి 25 న ప్రారంభించనున్నట్లు తెలిపారు. రానున్న నెలల్లో కాలువలు నీటి విడుదల ఆపు చేసిఉండే సమయంలో కాలువల పూడిక తీత పనులు చేపట్టడం జరుగు తుందని ఆమేరకు జల వనరుల శాఖకు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఉద్యాన వన శాఖ ద్వారా రాష్ట్రంలోనే అత్యధికంగా పామాయిల్ కొనుగోలు చేసినట్లు వివరించారు. జిల్లాలో 2000 వేల హెక్టర్లలో మైక్రో ఇరిగేషన్ కింద డ్రిప్ ఇరిగేషన్ కోసం లక్ష్యం కాగా 1814 మంది రైతులకు చెంది 2316 హెక్టార్ల లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ నుంచి పశువుల భీమా పధకం అందుబాటులోకి రానున్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు వివరించారు.

ఆరు మార్కెటింగ్ వ్యవసాయ కమిటీలు ఉన్నాయని మార్కెటింగ్ అధికారులు తెలిపారు. ప్యాడి సేకరణ కోసం ముందస్తు చర్యలలో భాగంగా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు టర్పలిన్స్ సిద్దం చేసుకోవడం జరిగిందని, వ్యవసాయ శాఖ అధికారులు ఇండెంట్ మేరకు సరఫరా చెయ్యడం జరుగుతుందని అన్నారు. ఆదర్శ రైతుల ఇతర వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, ప్రాజెక్ట్ డైరెక్టర్ (మైక్రో ఇరిగేషన్) ఎస్. రామ్ మోహన్, గ్రౌండ్ వాటర్ డి డి వై. శ్రీనివాస్, జెడి (మత్స్య) కృష్ణా రావు, డి హెచ్ ఓ వి. రాధాకృష్ణ,  ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *