విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల31వ తేది శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. జిల్లా ఉపాధి కల్పన, సిడాప్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 31వ తేది శుక్రవారం ఉదయ 10 గంటల నుండి ఐడిఐ కళాశాలల రోడ్డులోని రమేష్ హాస్పిటల్ ఎదురుగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ డిప్లొమా, డిగ్రీ, బి`టెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫార్మసీ అర్హత కలిగిన విద్యార్థులు మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మెగా జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని ఎంపిక చేసుకుంటారని ఇతర వివరాలకు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి 77996 69907, 80087 42842, 85018 96034 సంప్రదించాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News